ఏపీలో అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ రగడ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే మూడు రాజధానులు అంశం గత ఏడాదిన్నర కాలంగా రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అధికార వైసీపీ మూడు రాజధానులు - అభివృద్ధి వికేంద్రీకరణ అంశానికి కట్టుబడి ఉంది. మరోవైపు అధికార తెలుగుదేశం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019 శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉంటాయని చేసిన ప్రకటన ఒక్క సారిగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.
అందుకు తగ్గట్టుగానే జగన్ మూడు రాజధానులు బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం పొందేలా చేశారు. అయితే అప్పట్లో వైసిపికి మండలిలో బలం లేకపోవడంతో ఈ బిల్లు అక్కడ ఆమోదం పొందలేదు. తర్వాత మూడు రాజధానులపై కోర్టులో పలు కేసులు నడుస్తున్నాయి.
అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేసింది. మరోవైపు ఈ బిల్లులో లోపాలు సరిచేస్తూ దీని స్థానంలో సరికొత్త బిల్లు తీసుకువస్తామని జగన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
వైసీపీ ప్రజా ప్రతినిధులు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. ముఖ్యంగా అమరావతి విస్తరించి ఉన్న కృష్ణా - గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధులు సైతం మూడు రాజధానుల తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్నారు.
పైగా కృష్ణ - గుంటూరు జిల్లాల ప్రజలు కూడా స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అప్రతిహత విజయం కట్టబెట్టడంతో వారు కూడా మూడు రాజధానులు మద్దతు పలుకుతున్నారని చెబుతున్నారు.
ఈ రెండు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఇదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ రెండు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో... గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల్లోకి మూడు రాజధానుల అజెండాతో వెళతారా ? మూడు రాజధానుల తోనే అభివృద్ధి జరుగుతుందన్న ఎజెండా ప్రాతిపదికన గడపగడపకు వెళ్లే ధైర్యం ఎమ్మెల్యేలకు ఉందా ? అంటే కచ్చితంగా లేదని అంటున్నారు.
ఎవరైనా ఎమ్మెల్యే ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని జనాల్లోకి వెళితే వాళ్లకు చుక్కలు కనపడటం ఖాయం అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏదో పార్టీ అధిష్టానం నుంచి బలవంతపు ఒత్తిడి ఉండటంతోనే కృష్ణ - గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు మద్దతుగా మాట్లాడుతున్నారు తప్ప... వారికి కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేదని... ఆ పార్టీ లోనే చర్చ నడుస్తోంది.
ఇప్పటికే న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో రాజధాని ప్రాంత రైతులు - మేధావులు - ప్రజాప్రతినిధులు - సాధారణ ప్రజలు తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
మరోవైపు రైతులు అమరావతి నుంచి సింహాచలం వరకు కూడా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఈ అంశం తీవ్రమైన ప్రభావం చూపనుంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు లోలోపల భయంతో ఉంటూ పైకి మాత్రం డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు.