జగన్ మాట తప్పారు.. మేయర్ ఇవ్వనందుకు వైసీపీకి రాజీనామా

Update: 2021-03-19 08:32 GMT
వైసీపీలో అసమ్మతి సెగ బయటపడింది. బీసీలు, బడుగు బలహీన వర్గాలకే మేయర్ పదవుల్లో జగన్ పెద్దపీట వేయడంతో పదవులు ఆశించిన వారు అసమ్మతి రాజేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఓ కార్పొరేటర్ ఈ మేరకు బయటపడ్డాడు.

విశాఖపట్నం మేయర్ కుర్చీ ఫైట్ లో ఒక వికెట్ పడిపోయింది. విశాఖ మేయర్ పదవి తనకు ఇస్తానని సీఎం జగన్ మాట ఇచ్చారని.. ఇప్పుడు వేరే వారికి ఇచ్చి మాట తప్పారని 21వ డివిజన్ కార్పొరేటర్ వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు మేయర్ పదవి ఇవ్వనందుకున పార్టీ విశాఖ నగర  అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు వంశీకృష్ణ సంచలన ప్రకటన చేశారు. పార్టీలో సాధారణ కార్యకర్తలా పనిచేస్తానని ప్రకటించారు.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లుగా గోలగాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ గా జియానీ శ్రీధర్ లను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది.

తనకు మేయర్ పదవి ఇస్తానని జగన్ మాట తప్పాదని కార్పొరేటర్ వంశీకృష్ణ అలకబూనారు. తనకంటే జూనియర్లకు మేయర్, డిప్యూటీ మేయర్లు ఇవ్వడంపై ఏకంగా పార్టీ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సీటు ఫైట్ ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News