వైసీపీ సోష‌ల్ మీడియా ఐటీ వింగ్ అంటే కామెడీ అయిపోయిందా?

Update: 2021-12-21 17:42 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సోష‌ల్ మీడియా ఒక‌ప్పుడు చాలా బలంగా ఉండేది. పార్టీ అధినేత జ‌గ‌న్‌.. పాద యాత్ర చేసిన‌ప్ప‌డు.. దానిని ప్ర‌జ‌ల్లోకి  తీసుకువెళ్లి.. మంచి రెస్పాన్స్ వ‌చ్చేలా చేసింది. త‌ర్వాత కూడా ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. వైసీపీ ఐటీ విభాగం మంచి పాత్ర పొషించింద‌ని.. ఆ పార్టీ నేతలు చెబుతుంటా రు. అయితే.. ఇటీవ‌ల కాలంలో మాత్రం ఐటీ విభాగం ప‌రిస్ధితి దారుణంగా త‌యారైంద‌నే కామెంట్లు వినిపి స్తున్నాయి.ఐటీ విభాగంలో కొంద‌రు పెడుతున్న పోస్టుల కార‌ణంగా.. వైసీపీకి బ్యాడ్ నేమ్ వ‌స్తోంద‌ని అభిమానులు వాపోతున్నారు.

ఐటీ అంటే.. స్పెల్లింగ్ తెలియ‌ని కొంద‌రు వైసీపీ సోష‌ల్ మీడియా ఐటీ వింగ్ అని పేరు పెట్టుకుని కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఇవి.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, మ‌రోపార్టీ జ‌న‌సేనపై ఉంటున్నాయి. అయితే.. సాధార‌ణంగా ఎవ‌రైనా ఏ పార్టీనైనా.. వారు అనుస‌రించే విధానాల‌ను బ‌ట్టి విమ‌ర్శించ‌వొచ్చు. కానీ, ఈ ఐటీ విభాగం మాత్రం టీడీపీని, జ‌న‌సేన‌న‌ను కూడా  బండ‌బూతులు తిడుతూ.. అన‌రాని.. వినలేని మాట‌ల‌తో విమ‌ర్శిస్తుండ‌డం .. సంచ‌ల‌నంగా మారుతోంది. ఈ ప‌రిణామం గ‌మ‌నిస్తున్న‌వారు ఇదంతా కూడా వైసీపీకి న‌ష్ట‌మేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ పోస్టింగుల‌పై స్పందించిన వాస్తవ వైసీపీ ఐటీ విభాగం.. ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తోంది. ``మేం పార‌ద‌ర్శ కంగా ఉంటాం. ఎవ‌రినీ ఎప్పుడూ బూతులు తిట్ట‌లేదు. ఇప్పుడు కూడా అంతే.ఎవ‌రో అత్యుత్సాహ ప‌రులు వైసీపీని టార్గెట్ చేసుకుని ఇలా చేస్తున్నారు. దీనివ‌ల్ల పార్టీకి తీర‌ని న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఎవ‌రు ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోయినా.. వారు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నా యి. అధికార పార్టీని అడ్డు పెట్టుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్టు.. సోష‌ల్ మీడియాలో వ్యాఖ్య‌లు చేయ‌డం ద్వారా.. పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌ని అంటున్నారు.

అంతేకాదు.. పార్టీని అడ్డుపెట్టుకుని.. ఇస్టానుసారంగా గ్రామాల్లో బెదిరింపులు చేస్తున్నార‌ని.. వైసీపీ అధిష్టానానికి కూడా తెలిసిపోయింది. ఇక‌, ఇప్పటికైనా.. ఇలాంటి పోస్టింగుల‌కు చెక్ పెట్ట‌క‌పోతే.. ఫేక్ నేత‌లు.. పార్టీని న‌ష్ట‌ప‌రుస్తార‌ని అంటున్నారు నాయ‌కులు. మ‌రి పార్టీ అధిష్టానం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మొత్తానికి పార్టీలో న‌కిలీ నేత‌లు.. పార్టీ మంచి కోసం క‌న్నా.. భ్ర‌ష్టు ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News