తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా అధికార వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ గత కొంత కాలంగా ఎంపీ మార్గాని భరత్‌రామ్ వర్సెస్ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కొద్ది రోజుల క్రిందట వరకు రాజమండ్రి సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాల కన్వీనర్లుగా జక్కంపూడి వర్గానికి చెందిన నేతలే ఉండేవారు. అయితే భరత్ చక్రం తిప్పి ఈ రెండు నియోజకవర్గాలకు తనకు అనుకూలంగా ఉన్న వారికి కన్వీనర్ పదవులు ఇప్పించుకున్నారు. ఇక్కడ భరత్ పైచేయి సాధించినట్టు అయ్యింది. ఇక రాజాకు ఉన్న కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇటీవల పీకేశారు. రాజాను ఈ పదవి నుంచి తప్పించడం వెనక ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే ఆలోచన జగన్‌కు ఉందని ఆయన వర్గం చెపుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు భరత్ దూకుడుగా ముందుకు వెళుతుండడంతో ఆయన టార్గెట్ గా రాజా వర్గం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తోంది.
రాజా వర్గానికి చెందిన నేతలు ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ భరత్‌కు వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇచ్చారు. వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చిన జక్కంపూడి ఫ్యామిలీని విమర్శిస్తే సహించేది లేదని రాజాను హెచ్చరించారు. వాస్తవానికి వైసీపీలో జక్కంపూడి ఫ్యామిలీతో పాటు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల నుంచే కష్టపడ్డారు. ఆ మాటకు వస్తే చాలా మంది వైసీపీ ఆవిర్భావం నుంచే పార్టీ కోసం కష్టపడ్డారు. 2014 ఎన్నికల్లో ఓడి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నోకష్టనష్టాలు ఎదుర్కోన్నారు. ఎంపీ భరత్ మాత్రం ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందే పార్టీలోకి రావడంతో పాటు జగన్ వేవ్లో ఎంపీ అయ్యారు.
అయితే ఎంపీ అయ్యాక భరత్ పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడిన నేతలను పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మిగిలిన నేతల సంగతి ఎలా ఉన్నా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు భరత్‌కు మధ్య తీవ్రస్థాయిలో వార్ నడుస్తోంది. తాజాగా రాజా వర్గం నేతలు ఎంపీని టార్గెట్‌గా చేసుకుని ప్రెస్‌మీట్లలోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మీరు పార్టీలోకి గత ఎన్నికలకు ముందే వచ్చారని.. తాము ఇళ్లు కడితే గృహప్రవేశం చేసినట్టుగా ఎంపీ అయ్యారని.. అయితే ఇప్పుడు ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళితే మాత్రం సహించమని నేరుగానే వార్నింగ్‌లు ఇస్తున్నారు.
ఏదో రచ్చబండలు పెట్టి హడావిడి చేస్తే సరిపోదని.. ఈ రోజు పదవి ఉన్నందునే ఎంపీ దగ్గరకు ఏదో పదిమంది వస్తున్నారని.. రేపు ఆ పదవి లేకపోతే మీ అడ్రస్సే ఉండదని రాజా వర్గం నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందు రాజానగరం నియోజకవర్గానికి వస్తే రాజాను ఆయన తల్లి విజయలక్ష్మి లేకుండా అడుగుపెట్టని భరత్ ఇప్పుడు ఒక్కడే ఎలా ? వస్తారని ప్రశ్నిస్తున్నారు. భరత్ ఇప్పటకి అయినా తన పంథా మార్చుకుంటే భవిష్యత్తు ఉంటుందని.. లేకపోతే తాము సరైన టైంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరి నేతల మధ్య రాజీ కుదిరేలా వాతావరణం లేదు. ఇది ఈ రెండేళ్లలో మరింత ముదరడం ఖాయంగా ఉంది.