దేశీయంగా సంచలనం గా మారిన ఎస్ బ్యాంక్ వ్యవహారం లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు ఎస్ బ్యాంక్ ఫౌండర్ రాణా కపూర్ ను విచారణాధికారులు అరెస్టు చేశారు. 30 గంటల పాటు ఆయనను ప్రశ్నించిన అధికారులు చివరకు అరెస్టు చేశారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతోనే అరెస్టు చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. రాణా అరెస్టుతో ఎస్ బ్యాంకు దెబ్బతినడం వెనుక కుంభకోణం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డిపాజిటర్లను మోసం చేసే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిధులను తప్పుదోవ పట్టించారా? అనే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో ఎస్ ఫౌండర్ రాణా కూతురు రోషినీ కపూర్ ను పోలీసులు ముంబై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకోవడం ఆసక్తిదాయకంగా మారింది. ఆమె లండన్ వెళ్లిపోతుండ గా.. అధికారులు ఆపినట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె ఒక బ్రిటీష్ ఎయిర్ వే విమానం ద్వారా లండన్ ప్రయాణించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికే ఆమెపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయట. దీంతో ఆ మేరకు అధికారులు ఆమె ప్రయాణాన్ని ఆపేసినట్టుగా తెలుస్తోంది.
లుక్ ఔట్ నోటీసు జారీ అయిన నేపథ్యంలో.. ఆమె దేశం దాటడానికి వీల్లేదని ఆమెను పోలీసులు ఆపినట్టుగా తెలుస్తోంది. ఆమె లండన్ ప్రయాణం ఆగిపోవడం తో.. ఇంతకీ ఆమె ఎందుకు లండన్ వెళ్లే ప్రయత్నం చేశారనేది ఆసక్తిదాయకం గా మారింది.
దేశంలో కుంభకోణాలు చేసిన పలువురు వ్యాపారవేత్తలు విదేశాల కు పారిపోతున్న సంగతి తెలిసిందే. వారిలో లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీలాంటి వారున్నారు. వారిలో లలిత్ మోడీ, విజయ్ మాల్యాలు లండన్ లోనే తలదాచుకున్నట్టుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో తాజా కుంభకోణం ఎస్ బ్యాంక్ వ్యవహారంలో పాత్రధారులు అయినటు వంటి వారిలో కీలక వ్యక్తి కూతురు ఇలా లండన్ వెళ్లే ప్రయత్నం చేయడం తో, ఆమె కూడా మాల్యా దారిలోనే ప్రయత్నించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఆమెను విమానాశ్రయంలోనే ఆపేయడం ద్వారా.. మరో పరారీకి అవకాశం లేకుండా పోయిందేమో!