ఆ సీఎం సండే షెడ్యూల్ తెలిస్తే అవాక్కే!

Update: 2017-04-30 10:01 GMT
సామాన్యుడికి సండే వ‌చ్చిందంటే చాలా మామూలు కంటే మ‌హా బిజీగా ఉండ‌టం ఇప్పుడు కామ‌న్ అయిపోయింది. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రికి సండే అంటే ఎంత బిజీగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. దేశంలో అతి పెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యోగి అదిత్య‌నాథ్ సండే షెడ్యూల్ ఎలా ఉంటుందో తెలిస్తే.. కాసింత అవాక్కు అవ్వాల్సిందే.

దేశంలోని ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌తో పోలిస్తే.. భిన్న‌మైన వ్య‌క్తిత్వం.. న‌డ‌వ‌డిక‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న యోగి.. సండే షెడ్యూల్ మ‌రింత వైవిధ్యంగా ఉండ‌టం విశేషంగా చెప్పాలి.

నిత్యం మంత్రులు.. ప్ర‌జాప్ర‌తినిధులు.. అధికారుల‌తో స‌మావేశాలు.. ఇలా ఊపిరిస‌ల‌ప‌నంత బిజీగా ఉండే ముఖ్య‌మంత్రి.. ఆదివారం చాలా కూల్ గా స్టార్ట్ చేయ‌టం అదిత్య‌నాథ్‌కే సాధ్య‌మ‌వుతుందేమో. జంతుప్రేమికుడైన యోగి.. ఆదివారం తాను ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించే గోర‌ఖ్ పూర్‌ లో ప‌ర్య‌టించారు. తెల్ల‌వారుజామునే లేచిన సీఎం.. తానే స్వ‌యంగా గోశాల‌కు వెళ్లి.. ఆవుల‌కు.. దూడ‌ల‌కు స్వ‌యంగా ఆహారాన్ని అంద‌జేశారు.

గ‌తంలో ఎంపీగా ఉన్న‌ప్పుడు కూడా గోవుల‌కు మేత పెడుతూ.. వాటిని పేర్లు పెట్టి పిలుస్తూ.. వీలైనంత ఎక్కువ స‌మ‌యం గోసంర‌క్ష‌ణ‌శాల‌లో గ‌డిచే యోగి.. ముఖ్య‌మంత్రి అయ్యాక కూడా త‌న తీరు పెద్ద‌గా మార‌లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు. యూపీలోని అన్నిజిల్లాల్లో గోసంర‌క్ష‌ణాల‌యాల్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పిన యోగి.. డెయిరీల‌ను కూడా ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. హిందువులు ప‌విత్రంగా పూజించే.. గోవుల‌కు పెద్ద‌పీట వేసే.. యోగి.. ఆడంబ‌రాల‌కు దూరంగా సాదాసీదాగా మూగ‌జీవాల మ‌ధ్య త‌న ఆదివారాన్ని గ‌డ‌ప‌టం యోగి లాంటి వారికే సాధ్య‌మ‌వుతుందేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News