తాజ్ మ‌హాల్ ను తీసి పారేసిన యోగి స‌ర్కార్‌

Update: 2017-10-03 10:05 GMT
ఇప్పుడేదో భార‌త్ గురించి ప్ర‌పంచం మాట్లాడుకుంటుంది కానీ.. ఒక‌ప్పుడు భార‌త్ అంటే పాములు.. కోతులు ఉండే దేశ‌మ‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు చాలా చిత్ర‌విచిత్రంగా ఉంటార‌ని.. సంస్కృతి అన్న‌దే లేద‌ని.. ఆట‌విక మ‌నుషులుగా ప్రాశ్చాత్య ప్ర‌పంచం అనుకునే ప‌రిస్థితి. వందేళ్ల క్రితం ఇలాంటి మాట‌లు అనుకుంటే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్లే. పాతికేళ్ల క్రితం కూడా భార‌త్ గురించి ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న విదేశీయులు ప‌లువురు ఉన్నారు.

ఇటీవ‌ల కాలంలో అలాంటి ఇమేజ్ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. భార‌త్ కు మొద‌ట్నించి ఇమేజ్ తీసుకొచ్చిన వాటిల్లో తాజ్ మ‌హాల్ ఒక‌టి. ప్రేమ చిహ్నంగా చెప్పే ఈ పాల‌రాతి క‌ట్ట‌టం కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురికి సుప‌రిచితం కావ‌టమే కాదు.. ప్ర‌పంచ ఏడు వింత‌ల్లో ఒక‌టిగా నిలిచింది.

మ‌రి.. అలాంటి తాజ్ మ‌హాల్ మీద యోగి స‌ర్కారు అనుస‌రించిన వైనం చూస్తే షాక్ తినాల్సిందే. ఎంత హిందుత్వ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టికీ.. కొన్ని విష‌యంలో అనుస‌రించే తీరు కొత్త తిప్ప‌ల్ని తెచ్చి పెడుతుంద‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ తాజాగా ఒక మీడియా నోట విడుద‌ల చేసింది. ఇందులో టూరిజం అభివృద్ధితో పాటు.. ప‌ర్యాట‌క ప్రాంతాల ప్రోత్సాహానికి సంబంధించిన బుక్ లెట్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ మ‌హాల్ ప్ర‌స్తావ‌నే లేక‌పోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై యూపీ విపక్షాల‌తో పాటు ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌పంచంలోని ఏడు వింత‌ల్లో ఒక‌టైన తాజ్ మ‌హాల్ బొమ్మ‌ను ప‌ర్యాట‌క అభ‌వృద్దికి ఉద్దేశించిన బుక్ లెట్ లో అచ్చేయ‌క‌పోవ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. యూపీ సీఎం యోగి అదిత్య‌నాథ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గోర‌ఖ్ పూర్ దేవాల‌యం బొమ్మ ఉన్న‌ప్ప‌టికీ.. తాజ్ బొమ్మ మాత్రం వేయ‌క‌పోవ‌టం వివాదాస్ప‌దంగా మారింది. తాజ్ మ‌హాల్‌ను ముస్లిం క‌ట్ట‌డంగా చూడ‌టంతోనే బీజేపీ స‌ర్కారు ప‌క్క‌న పెట్టింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ ఆలోచ‌న‌ధోర‌ణికి తాజా ఉదంతమే ఉదాహ‌ర‌ణ‌గా చెబుతూ.. స‌మాజ్ వాదీ పార్టీ త‌ప్పు ప‌ట్టింది. అయితే.. ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్‌. ఎక్క‌డో పొర‌పాటు జ‌రిగింద‌ని.. తాజ్ విశిష్ఠ‌త‌ను త‌మ స‌ర్కారు గుర్తించింద‌ని.. త్వ‌ర‌లోనే ఆగ్రాలోనే అంత‌ర్జాతీయ విమానాశ్రయాన్ని క‌ట్టించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఇక‌.. తాము పంపిణీ చేసిన బుక్ లెట్ కేవ‌లం మీడియా కోస‌మే కానీ.. మిగిలిన వారి కోసం కాద‌న్నారు. అంటే.. మీడియాకు ఇచ్చే బుక్ లెట్ లో తాజ్ మ‌హాల్ బొమ్మ లేకుండా ఎందుకు ప్రింట్ చేయాలంటారు? అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు.
Tags:    

Similar News