మన పొరుగునే ఉన్న తమిళనాడులోని ఒక ప్రభుత్వ పథకం దేశంలోని ఎన్నో రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచి అక్కడ కూడా ఆ పథకం పెట్టేలా చేస్తోంది. కానీ... ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబు కుర్చీ ఎక్కినప్పటి నుంచి ఆ పథకం గురించి మాట్లాడుతున్నా... ఇప్పటికి మూడేళ్లయినా కూడా ఇంతవరకు దాన్ని అమలు చేయలేకపోయారు. ఆ పథకం ఇంకేదో కాదు.. రూ.5 కే భోజనం పెట్టి ఆకలి తీర్చే పథకం. తమిళనాడులో దాని పేరు అమ్మ క్యాంటీన్లు. జయలలిత పెట్టిన ఈ పథకం బాగుందని చంద్రబాబు సీఎం అయినప్పుడే చెప్పారు.. ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లుగా ఏపీలోనూ అమలు చేస్తామన్నారు. కానీ.. ఇంతవరకు ఇది పట్టాలెక్కలేదు.
ఈ పథకం అమలు చేయడానికి ముందు పరిశీలన కోసమంటూ అధికారులు నాలుగైదు సార్లు చెన్నై వెళ్లొచ్చారు. కానీ... పథకం మాత్రం ప్రారంభించలేదు. గత ఏడాది వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంబిచిన తరువాత అక్కడ ఒకటి స్టార్ట్ చేసినా కొన్నాళ్లకే మూసేశారు. సచివాలయం క్యాంటీన్లో బిజినెస్ తగ్గుతోందన్నదే దీని మూసివేత కు కారణం అని విమర్శలున్నాయి. ఇంకెక్కడా వీటిని ప్రారంభించలేదు.
అదే సమయంలో ఇతర రాష్ర్టాల సీఎంలు మాత్రం అమ్మ క్యాంటీన్ల గురించి తెలిస్తే చాలు తమ రాష్ర్టాల్లో అమలు చేసేస్తున్నారు. తాజాగా యూపీ డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ వీటిని అన్నపూర్ణ భోజనాలయ్ పేరుతో స్టార్ట్ చేయబోతున్నారు. రూ.3కే తిన్నంత టిఫిన్.. రూ.5కే తిన్నంత భోజనం అందులో పెడతారు.
యూపీ సీఎంగా యోగి బాధ్యత చేపట్టి గట్టిగా రెణ్నెళ్లు కాలేదు. ఇప్పటికే ఆయన అక్కడ పాలనను ముందెన్నడూ లేనంత కొత్తగా సాగిస్తున్నారు. ఏప్రిల్ 7న యూపీ పొరుగునే ఉన్న మధ్యప్రదేశ్ లో దీన దయాళ్ రసోయి పేరుతో ఈ రూ.5 భోజన పథకం పెట్టడంతో యోగి దృష్టి దానిపై పడింది. ఆయన ఆరా తీయగా ఈ పథకానికి మూలం తమిళనాడులో ఉందని తెలిసింది. ఆల్రెడీ ఒకట్రెండు రాష్ర్టాలు దీన్ని అమలు చేసి పేదల కడుపు నింపుతున్నాయని తెలిసింది. దీంతో ఆయన మధ్య ప్రదేశ్ లో స్టార్టయిన రెండో రోజునే అంటే ఏప్రిల్ 9న దీనిపై తొలిసారి ప్రకటన చేశారు. తాజాగా ఇప్పుడు దీన్ని మరింత వేగవంతం చేస్తూ అతి త్వరలో ప్రారంభించబోతున్నారు.
కాగా ఇంతకుముందు రాజస్థాన్ సీఎం వసుంధర రాజె సింథియా కూడా తమిళనాడులో ఈ పథకం గురించి తెలుసుకుని తమ రాష్ర్టంలో స్టార్ట్ చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్ కూడా అక్కడ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, హాస్పిటళ్లలో వీటిని ఏర్పాటు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా కొత్త సీఎం యోగి కూడా ఇది అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ... తమిళనాడుకు కూతవేటు దూరంలోనే ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మీనమేషాలు లెక్కిస్తూ మూడేళ్ల కాలంలో ఈ పథకాన్ని స్టార్ట్ చేయలేకపోవడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/