2.15కోట్ల మంది మ‌న‌సుల్ని దోచేసిన యోగి

Update: 2017-04-05 04:29 GMT
ప‌ట్టు పెంచుకునే అవ‌కాశం ఉన్న‌ప్పుడు ఆల‌స్యం చేయ‌కుండా నిర్ణ‌యాల మీద నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి మించింది మ‌రొక‌టి ఉండ‌దు. ఆ విష‌యాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ‌న్ బాగానే అర్థం చేసుకున్నారు. పాల‌న‌లో త‌న మార్క్ చూపించాల‌ని తెగ త‌పిస్తున్న ఆయ‌న‌.. త‌న‌కు ల‌భించిన అవ‌కాశాన్ని ఏ నిమిషంలోనూ వృధా చేయ‌టం లేదు. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా తీసుకుంటున్న నిర్ణ‌యాలు ఏ మాత్రం స‌రిపోవ‌న్న‌ట్లుగా ఆయ‌న తాజాగా మ‌రింత వేగాన్ని పెంచారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన భారీ హామీ అయిన రైతుల రుణ‌మాఫీకి సంబంధించిన నిర్ణ‌యాన్ని తాజాగా తీసేసుకున్నాడు. ప్ర‌భుత్వ ఖ‌జానాపై దాదాపు రూ.36వేల కోట్ల‌కు పైనే భారం ప‌డే రైతుల రుణ‌మాఫీపై సానుకూల నిర్ణ‌యాన్ని తీసేసుకున్నారు. స‌ర్కారు కొలువు తీరిన త‌ర్వాత జ‌రిగిన తొలి క్యాబినెట్ భేటీలో 2.15 కోట్ల మంది రైతుల‌కు మేలు జ‌రిగే రుణ‌మాఫీ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. చైత్ర‌మాస న‌వ‌రాత్రుల వేళ‌.. తొమ్మిది కీల‌క నిర్ణ‌యాల్ని ప్ర‌క‌టించారు. సీఎంగా అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లో రాష్ట్ర విద్యావ్య‌వ‌స్థ‌లో స‌మూల సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న ఆయ‌న‌.. ప్ర‌భుత్వ టీచ‌ర్లు కోచింగ్ సెంట‌ర్ల‌ను నిర్వ‌హించ‌కుండా నిర్ణ‌యం తీసుకున్నారు. వీటిపై నిషేధం విధించ‌ట‌మే కాదు.. రూల్స్‌ను ఉల్లంఘించిన వారిపై ఎఫ్ ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించటం గ‌మ‌నార్హం.

న‌వ‌రాత్రుల వేళ‌.. యోగి తీసుకున్న 9 నిర్ణ‌యాలు చూస్తే..

1.ఖ‌జానాపై రూ.36వేల కోట్ల భారం ప‌డినా ప‌ట్టించుకోక‌..  2.15కోట్ల మంది ప్ర‌యోజ‌నం క‌లిగించే రుణ‌మాఫీని అమ‌లు ప్ర‌క‌ట‌న‌

2. గోధుమ‌ల కొనుగోలు క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌

3. అక్ర‌మ క‌బేళాల‌పై చ‌ర్య‌లు

4. యాంటీ రోమియో స్వ్కాడ్లు

5. బంగాళ‌దుంప‌ల రైతుల ప్ర‌యోజ‌నాల‌పై అధ్య‌య‌నానికి క‌మిటీ

6. పారిశ్రామిక విధానం

7. అక్ర‌మ మైనింగ్‌ దారుల‌పై చ‌ర్య‌లు

8. ఘాజీపూర్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌

9. జాతీయ ఓబీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ ప్ర‌తిప‌త్తి క‌ల్పించిన ప్ర‌ధాని మోడీకి ధ‌న్య‌వాదాలు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News