బాలింతల కోసం తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న కిట్ గురించి ఇప్పటికే విని ఉన్నాం. దాదాపు రూ.2వేల విలువ చేసే వస్తువులతో కూడిన కిట్ కారణంగా.. పుట్టిన పిల్లలందరికి ఒకేలాంటి సౌకర్యాలు అందుతాయని చెప్పొచ్చు. పేద మహిళలకు వరం లాంటి ఈ కిట్ డిజైన్ అందరికి ఉపయోగపడేలా ఉందని చెప్పొచ్చు.
మరి.. కేసీఆర్ ఇస్తున్న కిట్ గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథన్‌కు తెలిసినట్లుంది. ఆయన తనదైన స్టైల్ లో తాజాగా ఒక కొత్త కిట్ గురించి ప్రకటించారు. కొత్తగా పెళ్లైన జంటలకు ఇవ్వనున్న ఈ కిట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్తగా పెళ్లైన జంటలను లక్ష్యంగా చేసుకొని ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి ఇవ్వని బహుమతుల్ని కిట్ రూపంలో గిఫ్ట్ గా ఇవ్వటం యూపీ సీఎం యోగికే సాధ్యమైందని చెప్పక తప్పదు.
నిజానికి ఈ కిట్ ఆలోచన వెనుక ఓ పెద్ద సమస్య కూడా ఉందని చెప్పాలి. దేశ జనాభా వృద్ధి రేటులో ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. జనాభావృద్ధిరేటును కంట్రోల్ చేసేందుకు వీలుగా నయి పహల్ పేరుతో కొత్త తరహా కిట్‌ను అందజేస్తున్నారు.
ఈ కిట్ లో గర్భనిరోధక సాధనాలతో పాటు మరికొన్ని వస్తువులు ఉండటం గమనార్హం. కండోమ్ లు.. గర్భనిరోధక సాధనాలు.. సురక్షిత శృంగారం.. కుటుంబ నియంత్రణ.. ప్రసవాల మధ్య సమయం గురించి వైద్య సమాచారంతో కూడిన బ్రోచర్లు.. తువాళ్లు.. కర్ఛీఫ్ లు.. నెయిల్ కట్టర్.. దువ్వెన.. అద్దం లాంటి వస్తువులు కూడా ఉండనున్నాయి. ఈ నెల 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ కిట్‌ల పంపిణీ మొదలు పెట్టనున్నారు. కొత్తగా పెళ్లైన జంటల్ని ఉద్దేశించి ప్లాన్ చేసిన ఈ కిట్ ఎంతవరకూ వర్క్ వుట్ అవుతుందో చూడాలి.