యోగీకి ఇంటిపోరు మొద‌ల‌యింది

Update: 2017-09-03 17:27 GMT
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రిజ‌ర్వేష‌న్లు తొల‌గించిన యోగీ. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ముస్లింల‌కు హెచ్చ‌రిక‌లు జారీచేసిన యోగీ. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ర‌హ‌దారుల మీద న‌మాజులు వ‌ద్ద‌న్న యోగీ. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రోడ్డు మీదే వ్ర‌తాలు చేయాల‌న్న యోగీ. సోష‌ల్ మీడియాలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ యోగీ ఆదిత్య‌నాథ్ గురించి చ‌క్క‌ర్లు కొట్టిన‌న్ని ఫేక్ న్యూస్ లు మ‌రే ముఖ్య‌మంత్రి గురించి కూడా రావు .. రాబోవ‌నే చెప్పాలి. అయితే యూపీలో జ‌రుగుతున్న దానికి, మీడియాలో - సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఏ మాత్రం పొంత‌న‌లేదు.

గోర‌ఖ్ పూర్ ఆసుప‌త్రిలో ఏకంగా 72 మంది శిశువులు ఆక్సిజ‌న్ అంద‌క మ‌ర‌ణించ‌డంతోనే అక్క‌డ ఆదిత్యానాథ్ ప‌నితీరు ఎలా ఉందో అంద‌రికీ అర్థం అయింది. యోగీ మీద ఉన్న స‌గం భ్ర‌మ‌లు తొల‌గింది ఈ సంఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతోనే. ఇక అక్క‌డ శాంతి భ‌ద్ర‌త‌లు ఏ మాత్రం అదుపులోకి రాలేదు. ఠాకూర్లు - ద‌ళితుల ప‌ట్ల త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ‌ల‌తో పాటు మ‌హిళ‌ల మీద లైంగిక దాడులు అధికం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో యూపీ ఆరెఎస్ ఎస్ దృష్టి ప‌డింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ లో శాంతిభద్రతల అంశంపై దృష్టి సారించాలని  ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కు ఆర్‌ ఎస్‌ ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్ సూచించారు. ఈ మేర‌కు ఆర్‌ ఎస్‌ ఎస్‌ అనుబంధ సంస్థల మూడు రోజుల సమన్వయ సదస్సు నేపథ్యంలో యూపీ ముఖ్య‌మంత్రి యోగి - ఉప ముఖ్య‌మంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య - దినేష్‌ శర్మతో ఆర్‌ ఎస్‌ ఎస్‌ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో గోరఖ్‌ పూర్‌ ఘటన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భగవత్‌ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మ‌హిళ‌ల మీద లైంగిక దాడులు పెర‌గ‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ లెక్క‌న యోగీకి ఇంటి పోరు మొద‌ల‌యిన‌ట్లేన‌ని భావించాలి. 
Tags:    

Similar News