తాజ్ మహల్ సందర్శన.. ట్రంప్ కు అరుదైన గిఫ్ట్

Update: 2020-02-24 11:16 GMT
ప్రపంచ ప్రేమికులకు గుర్తు ‘తాజ్ మహల్’. ఆగ్రాలోని ఈ ప్రేమ పిపాసి గుర్తును చూడడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. ఈ సాయంత్రం ఆగ్రాను సందర్శించారు.

డొనాల్డ్ ట్రంప్ దంపతులిద్దరూ ఆగ్రా ఎయిర్ పోర్టులో దిగగానే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి - గవర్నర్ ఆనంది బెన్ పటేల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి ఒక అరుదైన తాళం చెవిని అందజేశారు. ఆ తాళంతో వారు నగరాన్ని తెరిచి పర్యటనను లాంఛనంగా ప్రారంభించారు. విదేశీ ప్రతినిధులు ఆగ్రాకు వచ్చిన ప్రతీసారి ఇలా చేయడం ఆగ్రా కార్పొరేషన్ కు అలవాటు.

12 అంగుళాల వెండి తాళాన్ని గౌరవ చిహ్నంగా ట్రంప్ కు అందజేశారు. ఆయన ఆ కీని తెరిచి తన పర్యటనను ప్రారంభించారు. 12 అంగుళాల వెండి తాళం ఢిల్లీలో తయారు చేయించారు. తాళం తాజ్ మహల్ ఆకారంలో ఉంది. ట్రంప్ పర్యటన సందర్భంగా నెమలి ఆకారంలో ప్రజలు రోడ్ల కిరువైపులా నిలబడి ట్రంప్ కు స్వాగతం పలికారు. ట్రంప్ కు ఇచ్చిన తాళంతో ఆగ్రాలోని తాజ్ మహల్ తలుపులు తెరిచి పర్యటనను ట్రంప్ ప్రారంభిస్తారు.

    

Tags:    

Similar News