అసలే ఇది కరోనా టైం.. ఏమాత్రం తేడా కొట్టినా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. చిన్న పనికే అలసట వచ్చేవారు.. కండరాల నొప్పులు, జుట్టు రాలిపోవడం.. చర్మం నిగారింపు తగ్గిపోవడం.. తరచూ జ్వరం , జలుబు, అనారోగ్యాలు కలిగే వారు ఇలాంటి కరోనా టైంలో ఖచ్చితంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
విటమిన్ డీ శరీరానికి అందినప్పుడే అందం.. ఆరోగ్యం ఉంటుంది. ఈ డీ విటమిన్ ఎండలోకి వెళ్లినప్పుడు మన శరీరం సూర్యకిరణాల నుంచి విటమిన్ డిని సహజసిద్ధంగా తయారు చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఏసీ గదులు, చీకటి గదుల్లో పనిచేయడం వల్ల అసలు ఎండ పడక డీ విటమిన్ అందక అందరూ రోగాల బారిన పడుతున్నారు. వర్షకాలం, శీతాకాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్ల కూడా ఈ లోపం అందరిలో కలుగుతుంది. కాబట్టి రోజూ కనీసం 400 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ డీ మన శరీరానికి అవసరమయ్యేలా మనం చర్యలు తీసుకోవాలి.
విటమిన్ డీ సహజంగా సూర్యరశ్మి వల్ల దొరుకుతుంది.. ఇక దాంతోపాటు కొన్ని రకాల ఆహార పదార్థాలలోనూ లభిస్తుంది. కొవ్వులో కరిగే ఈ విటమిన్ కాల్షియం, పాస్పరస్ లను శరీరం గ్రహించేలా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా విటమిన్ డీ రోగకారక క్రిములతో పోరాడే టీ-కణాలు, రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్ డీ ముఖ్యంగా గుండె జబ్బులను, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. బరువును నియంత్రిస్తుంది.
విటమిన్ డీ ముఖ్యంగా చేపలు, చేప నూనెలు, గుడ్డు పచ్చసొన, చీజ్, కాలేయం, చికెన్, పుట్టగొడుగులు, పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు, పార్టీఫైడ్ నూనెలు, చిరుధాన్యాలు, పప్పులు, సోయా, నువ్వల్లో లభిస్తుంది. ఆకుకూరలైన తోటకూర, మునగాకుల్లో కూడా విటమిన్ డీ లభిస్తుంది. దానిమ్మ, రెజిన్స్, బొప్పాయిల్లో కూడా ఉంటుంది. ఇక లవంగాలు, యాలకుల్లో విటమిన్ డీ లభిస్తుంది. కాబట్టి రోగనిరోధక శక్తి పెరగాలంటే ఖచ్చితంగా ఈ విటమిన్ డీని పెంచుకోండి. అది పెరిగితే మీ శరీరం రక్షణ పరంగా భద్రంగా ఉంటుంది.