నా కోపాన్ని మీరు తట్టుకోలేరు : స్పీకర్ తమ్మినేని

Update: 2020-01-04 06:26 GMT
ఏపీ స్పీకర్ కోపం గురించి అందరికి తెలిసిందే. ఈ మధ్య అయన ఏది మాట్లాడినా కూడా వివాదంలా మారుతుంది. గత కొన్ని రోజుల ముందు ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం తనను ఆహ్వానించక పోవటం పైన బీసీ సంక్షేమ అధికారుల పైన స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం గా మారాయి. ఇక, ఇప్పుడు స్పీకర్ అదే తరహాలో మరోసారి వ్యాఖ్యలు చేసారు. సహనం కోల్పోతే..ఎవడిని కొట్టేస్తానో నాకే తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

పూర్తి వివరాలు చూస్తే .. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కట్యాచార్యుల పేట లో సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, మిల్లర్లు తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు స్పీకర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అయన అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక రైతుల ఫిర్యాదు పై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ.. నేను సహనం కోల్పోతే ఎవడిని కొట్టేస్తానో నాకే తెలియదు అంటూ అధికారుల పైన ఫైర్ అయ్యారు. దీంతో..అక్కడ ఉన్న అధికారులు ఒక్క సారిగా విస్తుపోయారు. అయితే, రైతుల సమస్య కావటంతో స్పీకర్ అధికారుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు అని , రైతులకు ఇబ్బంది కలిగిస్తారా అంటూ ఆగ్రహం ప్రదర్శించారని పార్టీ నేతలు చెబుతున్నారు.

విశాఖకు రాజధాని రావాలని...ఉత్తరాంధ్ర ప్రాంతం అప్పుడే డెవలప్ అవుతుందని చెబుతూ తమ జిల్లాల్లో నెలకొన్ని పరిస్థితుల పైన స్పీకర్ తమ్మినేని కొద్ది రోజుల క్రితం భావోద్వేగానికి గురయ్యారు. అంతకు ముందు ఎడారి అంటూ అమరావతిపైన ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు తప్పు పట్టిన విషయం తెలిసిందే. అమరావతిలో ఏముంది అదంతా ఎడారి అంటూ చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన తో సహా రాజధాని ప్రాంత రైతులు..స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు.


Tags:    

Similar News