జర్నలిజంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మొదట్లోనే చెప్పే మాట ఒకటి ఉంటుంది. దేన్ని వార్త అంటారు. దేన్ని కాదు అనే దానికి ఉదాహరణగా చెప్పే ఈ పోలిక.. ఇప్పుడు వార్తాంశంగా మారటం గమనార్హం. కుక్క మనిషిని కరిస్తే వార్తే కాదు.
అదే కుక్కను మనిషి కరిస్తే వార్త అవుతుందన్న పాత్రికేయ జీవితంలో నేర్పే తొలిపాఠం.. ఈసారి అక్షరసత్యమైంది. నిజంగానే ఒక వ్యక్తిని కుక్కను కరిచిన వైనం ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఈ విచిత్రం అమెరికాలో చోటు చేసుకుంది.
పెద్ద వయస్కులున్న ఒక ఇంటికి గుర్తించిన ఒక దొంగ ఇంటికి కన్నమేశాడు. తన చోరీ పూర్తి చేసుకొని ఉడాయిద్దామని అనుకున్న లోపు అతడి సుడి మారింది. చోరీ పూర్తి చేసుకొని బయటకు వెళ్లే వేళలో.. ఆ ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. దీంతో దొంగకు దరిద్రపుగొట్టు ఐడియా వచ్చింది. తాను పారిపోయేందుకు డెలివరీ ట్రక్కును ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తానని దొంగను బెదిరించాడు.
దీంతో బెదిరిపోయిన సదరు డెలివరీ బాయ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిబ్బందితో సహా ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సదరు దొంగను మాత్రం ఇంటి నుంచి బయటకు రప్పించలేకపోయారు.
దీంతో పోలీసుల జాగిలాన్ని లోపలకు వదిలారు. దొంగను గుర్తించిన కుక్క.. అతడ్ని పట్టుకుంది. కానీ.. కాసేపటికి పోలీసులు మాత్రం దొంగను అదుపులోకి తీసుకున్నామని.. అతడు కుక్కను కొరికి.. కత్తితో పొడిచినట్లుగా వెల్లడించారు.
కుక్క కారణంగా దొంగ.. దొంగ కారణంగా కుక్కు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స కూడా పంపారు. దొంగ పాత నేరస్తుడని.. అతడు గతంలో పలు కేసులతో సంబంధాలు ఉన్నాయని.. అతడి మీద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. కొత్తగా అతడిపైన చోరీ కేసుతో పాటు.. కుక్కను కరిచినందుకు అతడిపై కేసు నమోదు చేశారు.