ఈ మోడల్ గురించి తెలిస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు

Update: 2021-08-27 06:30 GMT
ప్రపంచంలో వింతలకు.. విశేషాలకు కొదవ ఉండదు. చూడాలే కానీ మన చుట్టూ ఉండే చాలా అంశాలు మనకు విస్మయానికి గురి చేస్తుంటాయి. తాజాగా వెలుగు చూసిన ఈ అమెరికన్ మోడల్ రోటీన్ కు చాలా భిన్నం. దురదృష్టంలోనూ అదృష్టం అన్నట్లు ఉంటుంది ఆమె జీవితం. ఈ అందమైన మోడల్ కు.. దేవుడిచ్చిన అందం సరిపోలేదని ఫీల్ అయ్యింది. అందుకే మరింత ఆకర్షణీయంగా మారాలనుకుంది. అందుకోసం భారీగా ఖర్చు చేసింది. చివరకు మొదటికే మోసం వచ్చిన దుస్థితి. అయినప్పటికి ఆమె మాత్రం రెండు చేతులారా సంపాదించటం ఈ మొత్తం ఎపిసోడ్ లో ఊరటగా చెప్పొచ్చు. ఇంతకూ ఆమె దురదృష్టంలో అదృష్టం ఏమిటన్నది చూస్తే..

అమెరికాకు చెందిన 24 ఏళ్ల మోడల్ ఇన్ స్టాలో చాలా ఫేమస్. ఆమెకు  భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తీసి పెట్టే ఫోటోకు తెగ స్పందిస్తారు. లైకులు.. మెసేజ్ లతో హోరెత్తేలా చేస్తారు. తన ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు వీలుగా.. ఆమె తన బాడీ షేప్ ను మరింత బాగా సిద్ధం చేసుకోవాలని భావించింది. ఇందులో భాగంగా బ్రెజీలియన్ బట్ లిఫ్టుకు ప్రయత్నించింది. ఇందుకోసం రూ.14.8 లక్షలు ఖర్చు చేసింది.

ఈ ప్రక్రియలో బాడీలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న కొవ్వును తొలగించటం ద్వారా శరీరాన్ని మరింత ఆకర్షణీయంగా చేసుకోవాలని భావించింది. పిరుదుల్లో ఉన్న కొవ్వును తొలగించటంతో ఆమె ఊహించని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. దీంతో.. ఆమె సరిగా కూర్చోలేని దుస్థితి. ఆమె చేయించుకున్న సర్జరీ ఫెయిల్ కావటంతో ఆమె తెగ ఇబ్బంది పడుతోంది. ఇంత దురదృష్టంలోనూ ఆమె లక్ ఏమంటే.. ఇప్పటికి ఆమె పెట్టే ఫోటోలకు అమితమైన ఆదరణ లభిస్తోంది.

గతంలో ఆమె నెలకు 25వేల డాలర్లు సంపాదిస్తుంటే.. తాజాగా మాత్రం 2లక్షల డాలర్లు సంపాదిస్తున్నట్లు చెబుతోంది. సంపాదన పరంగా ఢోకా లేనప్పటికీ.. ఆరోగ్య పరంగానే సమస్యల్ని ఎదుర్కొంటోంది. తాను చేయించుకున్న సర్జరీ ఫెయిల్ అయిన నేపథ్యంలో మరోసారి దాన్ని సరిచేసుకునేలా సర్జరీ చేసుకుంటారా? అంటే మాత్రం నో అంటే నో అని తేల్చి చెబుతోంది. ఇలాంటి సిత్రమైన రియల్ స్టోరీ ఇప్పటివరకు మీరెప్పుడూ విని ఉండరు కదూ?
Tags:    

Similar News