నాకు అతి పెద్ద కుటుంబం ఉంది. అదే పేద కుటుంబం. మీది పెత్తందారులు వర్గం. మన ఇద్దరి మధ్యనే పోటీ. రేపు ఎవరు గెలుస్తారో చూసుకుందామంటూ జగన్ చేస్తున్న ఈ రాజకీయ సవాల్ తెలుగుదేశానికి మునుపెన్నడూ ఎదురుకానిది. వైసెపీని పేదల పార్టీగా చేస్తూ టీడీపీని పెత్తందారుల వైపు నెడుతూ జగన్ అతి పెద్ద విభజన రేఖ గీసేశారు. నీ ఓటు బ్యాంక్ ఏది అంటూ కవ్విస్తున్నారు. ఏపీలో ఉన్న వారిలో నూటికి తొంబై మంది నా వాళ్ళే నా మద్దతుదారులే అని జబ్బలు చరుస్తున్నారు.
మొత్తానికి రాజకీయాల్లో తలపండింది అనుకుంటున్న చంద్రబాబుకు ఈ కుల విభజన ససేమిరా అర్ధం కాని పజిల్ గానే ఉండబోతోంది. మాట్లాడితే జగన్ నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్స్సెలు, నా మైనారిటీలు అంటూ తన వెనక ఉన్న ఆ నలుగురుని ముందుకు తెస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో బీసీ ఓటు బ్యాంక్ యాభై శాతంగా ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కలుపుకుంటే సింహ భాగం ఆ పార్టీదే అవుతుంది.
ఇక 2014 ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి మధ్య ఉన్న తేడా జస్ట్ ఒక్క శాతం. ఆ మాత్రం దానికే ఏకంగా అయిదు లక్షల ఓట్లు చిల్లు పడ్డాయి. అవే అధికారంలోకి రానీయకుండా చేశాయి. అందుకే ఇపుడు జగన్ జాగ్రత్తపడుతున్నారు. ఆనాడు తన వెనక ముగ్గురు ఉన్నారు. వారే ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్. వారితో కూడితేనే అయిదు లక్షల ఓట్ల తక్కువతో టీడీపీ సమీపానికి వచ్చేశారు. ఇపుడు టీడీపీకి ఉన్న అతి పెద్ద ఓటు బ్యాంక్ కి ఆయన చిల్లు పెడుతున్నారు. అంటే బీసీలలో సగానికి సగం మంది తనకు ఓటేసినా ఆ అయిదు లక్షల ఓట్లను ఈజీగా తెచ్చుకుని టీడీపీని వెనక్కి నెట్టడం ఖాయం. అందుకే జగన్ ఇపుడు బీసీలనే నమ్ముకుని జయహో బీసీ అని అతి పెద్ద సదస్సు నిర్వహించారు.
అంతే కాదు తన వెనక వారున్నారు వారి హృదయంలో తాను ఉన్నాను అంటూ బీసీలను సాలిడ్ గా సొంతం చేసుకున్నారు. బీసీ ఓటు బ్యాంక్ సగమై, కాపు ఓట్లలో కూడా పూర్తిగా దక్కక మిగిలిన సామాజిక వర్గాలలో అరకొర ఓ ట్లు పడితే టీడీపీ రేపటి సోషల్ ఇంజనీరింగ్ పాస్ మార్కులు కూడా దక్కకుండా ఓడిపోతుంది అన్నదే జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్ అందుకే ఆయన అలా టీడీపీని కార్నర్ చేస్తున్నారు.
అంతే కాదు పేదలు పెత్తందారులు అంటూ రెచ్చగొడుతున్నారు. తాను పేదవాడికి నగదు వేసి వారిలో భరోసా నింపితే అది ఇష్టం లేని టీడీపీ దాన్ని అడ్డం పెట్టుకుని ఉన్న అనుకూల మీడియా తనను విమర్శిస్తున్నారు అని జగన్ ఆరోపిస్తున్నారు. అందుకే పేదలకు పెత్తందారులకు మధ్య రేపటి ఎన్నికల్లో యుద్ధం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. తన వైపు ఉన్న పేదలు అంతా టీడీపీ మీద సమరం సాగించాలిందే అని ఆయన ఇచ్చిన పిలుపుని వేరేలా అర్ధం చేసుకుంటే వైసీపీకే వారు ఓటు వేయాలన్నదే ఆయన ఆలోచన అని ఈజీగా బోధపడుతుంది.
మొత్తానికి చూస్తే చంద్రబాబుని ఆయన టీడీపీని పరిమితం చేస్తూ వారిని ఒక కార్నర్ చేస్తూ జగన్ ఆడుతున్న రాజకీయ ఆటలో బాబు ఇరుక్కుపోతారా లేక బయటపడి తన సత్తా చాటతారా అన్నది చూడాల్సి ఉంది. మరో వైపు చూస్తే ఇదిలా ఉంటే బీసీ నేతలకే రానున్న రోజులలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామని కూడా జగన్ ప్రకటించారు. వారినే ముందు పెట్టి సామాజిక న్యాయం ఏమిటో చూపిస్తామని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ సోషల్ ఇంజనీరింగ్ లో పండిపోయాను అని చెబుతున్నారు. 2024లో మొత్తం సీట్లు మనవే అంటున్నారు. మరి అది ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ ఒక పద్ధతి ప్రకారమే పక్కా వ్యూహంతో టీడీపీని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.