దర్శకరత్న - ప్రముఖ నిర్మాత దాసరి నారాయణరావును జనసేన అధినేత పవన్ కల్యాణ్ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దాసరిని పరామర్శించేందుకు పవన్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ - నిర్మాత శరత్ మరార్ వెంట ఉన్నారు. మూడు రోజుల క్రితం మూత్రపిండాలు - ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
కాగా కిమ్స్ ఆస్పత్రిలో దాసరి నారాయణరావును పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. దాసరి నారాయణరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని తెలియగానే బాధనిపించిందని పవన్‌కల్యాణ్ అన్నారు. అందుకే ఆస్పత్రి వర్గాలతో మాట్లాడేందుకు నేరుగా కిమ్స్ కు వచ్చినట్లు పవన్ వివరించారు. దాసరి ఆరోగ్యం మెరుగు అవుతుందని వైద్యులు నమ్మకంగా ఉన్నారని పవన్ తెలిపారు. రేపు వెంటిలేటర్ తీసేస్తామని చెప్పారని, వెంటనే ఆయన కోలుకుంటారని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా. ఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు.
మరోవైపు.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు. దాసరి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ ను కిమ్స్‌కు పంపారు. మరోవైపు కిమ్స్ ఆస్పత్రి ఎండీ భాస్కరరావు మీడియాతో మాట్లాడుతూ దాసరి నారాయణరావు కిడ్నీల పనితీరు బాగానే ఉందని తెలిపారు. మంగళవారం ఆయనకు డయాలసిస్ చేశామని, ఒకరోజు అబ్జర్వేషన్ లో ఉంచామని వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/