రిలీఫ్ టూర్: ప్రకృతి ఒడిలో సీఎం దంపతులు

Update: 2021-08-29 04:14 GMT
అరకొర ఉద్యోగాలు చేసే వారే అత్యంత బిజీ బిజీగా గడుపుతున్న రోజులివీ. అలాంటిది ఒక రాష్ట్రానికి సీఎం ఎంత బిజీ ఉంటారు. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు.ఆయన విదేశీ టూర్లు వెళ్లింది కేవలం నాలుగైదు సార్లే. ఒకసారి ఎన్నికల్లో గెలిచాక దేవుడిని దర్శించుకునేందుకు జెరూసలెం వెళ్లాడు. కూతుళ్ల చదువుల కోసం యూరప్, అమెరికా వెళ్లాడు. అంతే తప్ప తన వ్యక్తిగత జీవితం కోసం ఎప్పుడూ టూర్లకు వెళ్లింది లేదు. అయితే తాజాగా తన 25 ఏళ్ల దాంపత్య జీవితం పూర్తికావడంతో భార్య భారతితో కలిసి విహారయాత్రకు వెళ్లాడు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు తన భార్య భారతితో  కలిసి 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. పాతికేళ్ల ప్రత్యేక సందర్భం కావడంతో  జగన్ తన బిజీ హడావిడి షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సిమ్లాకు చేరుకున్నాడు.

జగన్ తన వివాహ వార్షికోత్సవ వేడుకల గురించి తన పర్యటన గురించి ఎక్కువగా ఫోకస్ చేయలేదు. చాలా తక్కువ ప్రచారం కల్పించి సైలెంట్ గా ఉంచారు. జగన్ తన భార్య భారతితో కలిసి సిమ్లాలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు. ఈ జంట అక్కడ పర్యటిస్తున్న ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసిపి అనుచరులు దానిని షేర్లు చేస్తూ  లైక్‌లతో హోరెత్తిస్తున్నారు.

జగన్ నేవీ బ్లూ షర్టు.. డెనిమ్ జీన్స్‌లో షూస్ ధరించి టిప్ టాప్ గా హీరోలా కనిపిస్తున్నారు. బహుశా చాలా కాలం తర్వాత ఏపీ సీఎంను  ఈ రంగు చొక్కాలో చూడడం.. సల్వార్ కమీజ్‌లో ఎప్పుడూ కనిపించే భారతి అదే శైలిలో దుస్తుల్లో కనిపించింది. చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ చూస్తే చాలా సుందరంగా ఉంది. సీఎం జగన్ -భారతి దంపతులు కలిసి చాలా రోజుల తర్వాత ఇలా ఆనందంగా గడుపుతున్నారని తెలుస్తోంది. వారికి మనమూ 'వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు' చెబుదాం.
Tags:    

Similar News