ఏపీ హోదా కోసం పిల్లాడు ప్రాణం తీసుకున్నాడు

Update: 2018-09-18 06:46 GMT
విభ‌జ‌న కార‌ణంగా దారుణంగా దెబ్బ తిన్న ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని స‌మూలంగా మార్చే శ‌క్తి ప్ర‌త్యేక హోదాకు మాత్ర‌మే ఉందన్న అభిప్రాయం ఏపీ ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. ఏపీ విభ‌జ‌న‌లో భాగంగా ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రానికి వ‌రాలు.. ఏపీకి శాపాలు మాత్ర‌మే ఇచ్చార‌ని న‌మ్ముతున్న ఆంధ్రోళ్లు తీవ్ర ఆగ్ర‌హంతోనూ.. ఆవేద‌న‌తోనూ ఉన్నారు. విభ‌జ‌న స‌హేతుకంగా జ‌ర‌గ‌లేద‌న్న విష‌యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వారికి.. కేంద్రం ఇస్తాన‌న్న ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌టం వారిని మ‌రింద ఆందోళ‌న‌కు గుర‌య్యేలా చేస్తోంది.

ఏపీ రాజ‌కీయ పార్టీలు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్నా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌టం.. కేంద్రం ప‌ట్టించుకోక‌పోవ‌టంపై ఏపీ ప్ర‌జ‌లు నిరాశ‌.. నిస్పృహ‌ల‌కు గురి అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు ప్రాణ‌త్యాగం చేస్తున్న వైనం ఇప్పుడు కొత్త క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక‌ హోదా కావాలంటూ ఈ మ‌ధ్య కాలంలో ప‌లువురు ప్రాణ‌త్యాగానికి వెనుకాడ‌టం లేదు. ఈ కొత్త సంస్కృతి ఏపీ ప్ర‌జ‌ల్ని.. రాజ‌కీయ పార్టీల్ని క‌లిచివేస్తోంది.

ధైర్యంగా పోరాడి సాధించుకోవాలే కానీ.. ఇలా బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌న్న మాట ప‌లువురు చెబుతున్నా.. ఈ ఆత్మ‌హ‌త్య‌ల ప‌రంపర ఆగ‌టం లేదు.

తాజాగా త‌న అన్న‌కు ఉద్యోగం రావ‌టం లేద‌న్న మ‌న‌స్తాపంతో 14 ఏళ్ల చిన్నారి ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం షాకింగ్ గా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా భీమిలి నియోజ‌క‌వ‌ర్గం ఆనంద‌పురంలో ఉన్న జ‌గ‌న్‌.. ఈ ఉదంతం గురించి విన్నంత‌నే షాక్‌కు గుర‌య్యారు. తీవ్ర విచార‌ణం వ్య‌క్తం చేశారు.

మృతుని కుటుంబానికి సంతాపాన్ని తెలిపి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుంద‌ని.. ప్ర‌త్యేక హోదాను త‌ప్ప‌క సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. యువ‌త తొంద‌ర‌పాటు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని.. సంయ‌మ‌నాన్ని పాటించాల‌ని కోరారు.  కేంద్రం తొండాటను ధైర్యంగా పోరాడాలే కానీ.. ఆత్మ‌హ‌త్య‌ల ఆలోచ‌న‌ల్ని ద‌రి చేర‌నివ్వ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లు గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది.
Tags:    

Similar News