ముందుగా ప్రకటించినట్లుగానే ఆదివారం ప్రవాసాంధ్రులతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ తో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటనలు చోటుచేస్తుకున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... ప్రత్యేక హోదా కోసం దశలవారీ పోరాటం సాగిస్తామని, అందులో భాగంగా తుదిదశలో అవసరమైతే ఎంపీల చేత రాజీనామాలు కూడా చేయిస్తామని ప్రకటించారు. ఆ సంగతి అలా ఉంచితే.. కార్యక్రమం మొదట్లోనే ఈ కర్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు జగన్ ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అత్యంత బలమైన కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని ఎలా అనుకున్నారు? ఇప్పటికే మీపై పలురకాల కేసులు ఉన్నాయి కదా.. అయినా కూడా పోరాడుతున్నారు అనేలా ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలపై జగన్ నవ్వుతూనే... స్పందించారు.
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టించిందని, నేడు అత్యంత బలమైన ప్రభుత్వంతో పోరాడుతున్నా... ఫలితంగా ఏమి జరిగినా అది తలరాతే (నుదిటిపై వేళు చూపిస్తూ) అని జగన్ అన్నారు. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని, తన వ్యక్తిగత ప్రయోజనాలకోసం ఐదు కోట్ల ప్రజల అవసరాన్ని ఫణంగా పెట్టలేనని, తన వ్యక్తిగత అవసరంకోసం రాష్ట్రప్రజల జీవితాలను బలితీసుకోలేననే స్థాయిలో జగన్ స్పందించారు. ఐదుకోట్ల మందిలో చంద్రబాబుకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, తనకు ప్రతిపక్ష నాయకుడు అయ్యే అవకాశం ఆ దేవుడే ఇచ్చాడని, ఆ గొప్ప అవకాశాన్ని వ్యక్తిగత ప్రయోజనలకు ఉపయోగించడం దారుణమని జగన్ అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో తనపై కేసులు పెట్టింది చంద్రబాబుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అని.. ఇది తనపై పెట్టిన రాజకీయ కేసని జగన్ చెప్పే ప్రయత్నం చేశారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత కాలం.. కాంగ్రెస్ లో ఉన్నంత కాలం.. రాజశేఖరరెడ్డి, జగన్ మంచివాడేనని, ఎప్పుడైతే ప్రజలకు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ ను వీడటం జరిగిందో అప్పుడు కాంగ్రెస్ - టీడీపీలు ఏకమై రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్రలు పన్నారని అన్నారు.అ
ఏది ఏమైనా... ఈ ప్రశ్న అడగడంపై రేపు జగన్ పై ఏమైనా కేసులు పెట్టినా, గత కేసులపై ఎలాంటి చర్యలున్నా అది "ప్రత్యేక హోదా పోరాట ఫలితమే" అనే సంకేతాలు బయటకు వెళ్లిపోయినట్లే!!