రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వేళ.. రోడ్డు పక్కన నిలబడిన ఒకరి చేతిలో ఉన్న బ్యానర్ ను చూసి వెనువెంటనే కాన్వాయ్ ఆపాలంటూ ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాను పవర్లో ఉన్నా.. లేకున్నా ప్రజల కష్టాల గురించి ఆరా తీస్తూ.. చేతనైనంత సాయం చేసే జగన్.. సీఎంగా ఉన్న వేళ ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి అభినందనలు పొందేలా చేసింది. విశాఖలో శారదాపీఠాధిపతి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆయనకు రోడ్డు పక్కన ఒకరు పట్టుకొని నిలుచున్న బ్యానర్ లోని అంశం ఆయన దృష్టిని ఆకర్షించింది. వెంటనే కాన్వాయ్ ను ఆపమని ఆదేశించారు.
బ్లడ్ కేన్సర్ తో బాధపడుతున్న మా స్నేహితుడ్ని కాపాడంటూ ఉన్న బ్యానర్ ను చూసిన జగన్.. వాహనం ఆపి వారి వద్దకు వెళ్లారు. తమ స్నేహితుడు నీరజ్ బ్లడ్ కేన్సర్ తో బాధ పడుతున్నారని.. ఆపరేషన్ కు రూ.25లక్షల ఖర్చు అవుతుందని.. ఈ నెల 30 లోపు అతడికి ఆపరేషన్ చేయించాలని వైద్యులు చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తో వారు చెప్పారు.
వెంటనే స్పందించిన జగన్.. ఆపరేషన్ కు తుది గడువు వరకు అస్సలు వెయిట్ చేయొద్దని.. వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన బాధ్యతను జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ కు అప్పజెప్పారు. మానవత్వంతో సీఎం జగన్ స్పందించిన తీరుకు ఆ స్నేహితుతు సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాదు.. నిలువెత్తు మానత్వంతో మూర్తీభవించే సీఎంను తాము ఇప్పటివరకూ చూడలేదని వారు భావోద్వేగానికి గురయ్యారు. సాయం చేసే చేతులు ఎప్పుడూ అవసరం కోసం ఎదురుచూసే కన్నుల్ని ఒక కంట కనిపెడతాయన్న భావన తాజా ఉదంతాన్ని చూస్తే కలుగక మానదు.