జగన్‌ స్కెచ్‌ ఫలించనుందా..?

Update: 2019-02-17 04:51 GMT
2014 ఎన్నికల్లో ధీటైన పోటీతో సీట్లు కొట్టుకొచ్చిన వైసీపీ అధికారం మాత్రం సాధించలేకపోయింది.   దీంతో ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని పార్టీ అధినేత జగన్‌ రకరకాల స్కెచ్‌ లు వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ కు మరికొద్దిరోజులే ఉండడంతో ఇప్పటి నుంచే పార్టీ క్యాండెట్లను జగన్‌ ఎంపిక చేస్తున్నాడు. అయితే కొత్తవారి కంటే 'ఆపరేషన్‌ ఆకర్ష్‌' పేరిట టీడీపీ నుంచి నాయకులను చేర్చుకొని బరిలో బలమైన అభ్యర్థులను నిలబెడితే అనుకున్నది సాధించవచ్చని జగన్‌ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటో లోక్‌ సభ పోరు కూడా సాగనుంది. ఈ నేపథ్యంలో పార్టీకి క్యాండెట్లు లేని కొన్ని స్థానాల్లో జగన్‌ ప్రత్యేక దృష్టి పెటారు. వీటిలో విజయవాడ ఎంపీ స్థానంపై తాజాగా తీవ్ర చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఈ స్థానంలో వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్‌ ఓడిపోయారు.  ఇక్కడ టీడీపీ అభ్యర్థి కేశినేని భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో అప్పటి నుంచి వైసీపీకి సరైన నాయకుడు లేకుండా పోయారు.

కొన్ని రోజుల కిందట సూపర్‌ స్టార్‌ కృష్ణ సోదరులపై జగన్‌ వల వేశారు. వీరిలో ఆదిశేషగిరి రావు వచ్చినట్లే వచ్చి టీడీపీలో చేరారు. వీరి టీడీపీలో చేరడంతో విజయవాడ ఎంపీ స్థానంలో తనకు తిరుగులేదని కేశినేని నాని భావించారు. కానీ అనూహ్యంగా జగన్‌ దాసరి జై రమేశ్‌ ను తెరపైకి తెచ్చారు. విజయవాడ జిల్లాలో మంచి పట్టున నేతగా జై రమేశ్‌... కేశినేని నానికి గట్టి పోటీ ఇవ్వగలడని జగన్‌ భావిస్తున్నారు. మరోవైపు ఇక్కడి ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి  కూడా పోటీ లేకపోవడంతో ఇక ఆయనే ఎంపీ క్యాండెట్‌ అని అనుకుంటున్నారు.

ఇక చిత్తూరు జిల్లాపై కూడా జగన్‌ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీకి తక్కువ సీట్లు వచ్చాయి. దీంతో ఈసారి ఎలాగైనా ఈ జిల్లాలో ఫర్ఫామెన్స్‌ చూపించాలని తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి సామాన్య కిరణ్‌ పరాజయం చెందారు. మళ్లీ ఆయన పొలిటికల్‌గా యాక్టివ్‌ గా లేరు. దీంతో ఇక్కడ సరైన అభ్యర్థి కోసం జగన్‌ ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు. అయితే ఇక్కడ అభ్యర్థి కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News