ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ ట్రైనింగ్ అదిరిందిగా!

Update: 2019-07-03 08:58 GMT
పాల‌న‌లో త‌న మార్క్ చూపించి కేవ‌లం నెల వ్య‌వ‌ధిలోనే స‌మ‌ర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న అధినేత‌గా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని చెప్పాలి. చ‌క‌చ‌కా నిర్ణ‌యాలు తీసుకోవ‌ట‌మే కాదు.. విలువ‌ల విష‌యంలో ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా ఒప్పుకునేది లేద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. సొంత పార్టీ నేత‌ల‌తో పాటు.. అధికారుల‌కు కూడా అవినీతి విష‌యంలో ఊరుకునేది లేద‌న్న వార్నింగ్ ఇవ్వ‌టం తెలిసిందే.

అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం కానున్న నేప‌థ్యంలో పార్టీ ఎమ్మెల్యేల‌కుశిక్ష‌ణ శిబిరాన్నినిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శిక్ష‌ణ కార్య‌క్ర‌మం అన్నంత‌నే స్టీరియో టైపు ప్ర‌సంగాల‌తో పొద్దు పుచ్చ‌టం కాకుండా విలువైన స‌ల‌హాలు సూచ‌న‌ల‌తో పాటు.. ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావిస్తూ ట్రైనింగ్ అంటే ఇలా ఉండాల‌న్న‌ట్లుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

ఈ సంద‌ర్భంగా పార్టీ ఎమ్మెల్యేల‌కు కొత్త టార్గెట్లు పెట్టారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కావ‌టానికి అర‌గంట ముందే అసెంబ్లీలో ఉండాల‌ని.. అసెంబ్లీ నిబంధ‌న‌ల్ని పూర్తిగా చ‌ద‌వాల‌ని చెప్పారు. ప్ర‌తి ప‌ది మంది ఎమ్మెల్యేల‌కు ఒక స‌మ‌న్వ‌య క‌ర్త ఉంటార‌ని చెప్ప‌టం ద్వారా.. ప్ర‌తి ఒక్క‌రు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పార‌ని చెప్పాలి.
స‌మావేశంలో జ‌గన్ ప్ర‌స్తావించిన కీల‌కాంశాల్ని చూస్తే..

+  అసెంబ్లీలో  అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలి. అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్‌ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దు. గత ప్రభుత్వం మాదిరిలా కాక సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పిద్దాం. సభను హుందాగా నడిపిద్దాం.

+  సభలో మాట్లాడే అవకాశం దక్కాలంటే చేయి పైకి ఎత్తితే చాలనిఅనుకోవ‌ద్దు.  నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే ఆ అవకాశం దక్కుతుంది.  ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ముందు కసరత్తు చేయాలి. ఎంత గొప్ప వ్యాఖ్యాత అయిన అసెంబ్లీలో ఫెయిల్‌ అవుతారు. సభలో నిబంధనల ప్రకారం స్పీకర్‌ వ్యవహరిస్తారు.

+  ప్రతి అంశంపై సభ్యుడు అవగాహన పెంచుకోవాలి. అవకాశం వచ్చి మాట్లాడకుంటే ఆ సభ్యుడు ఫెయిల్‌ అవుతారు. సరైన ప్రజెంటేషన్‌ లేకుంటే సభ్యుడు రాణించలేడు. సభా సమయాన్ని వృధా చేయొద్దు.ప్రతి ఒక్క ఎమ్మెల్యే రూల్స్‌ బుక్‌ని చదవాలి.

+  ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే గత ప్రభుత్వం మైక్‌లు కట్‌ చేసేది. ఆ ప్రభుత్వంలో మాదిరి ఈ అసెంబ్లీ నిర్వహణ ఉండదు. శాసనసభలో ప్రతిపక్షం అనేది ఉంటేనే బాగుంటుంది. టీడీపీకీ 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో అయిదుగురిని లాగేస్తే ప్రతిపక్షం ఉండదని చాలామంది చెప్పారు. కానీ.. నేను అలా చేయ‌ను.

+   పార్టీ మారితే రాజీనామా చేయాలి. లేకుంటే అన‌ర్హ‌త వేటు అయినా వేయాలి. గ‌తంలో ఇక్క‌డెక్క‌డా అన‌ర్హ‌త వేటు వేయ‌లేదు. రాజీనామాలు చేయించ‌లేదు. మీటికి భిన్నంగా ఉండాలంటే మ‌నం మార్గ‌ద‌ర్శ‌కంగా ఉండాలి. మనకు వాళ్లకు తేడా ఉండాలి కదా. మ‌నం ఎవ‌రైనా ఎమ్మెల్యేను తీసుకోవాలంటే రాజీనామా చేయించి.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి మ‌నం గెలిపించిన త‌ర్వాతే మ‌న ఎమ్మెల్యే అవుతాడు.

+   అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడేందుకు పూర్తి అవకాశం ఇస్తాం. వారు చెప్పేది కూడా పూర్తి విందాం. ఆ తర్వాత ప‍్రభుత్వం చెప్పే సమాధానంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.

+  మనపై మనకు.. పాలనపై అంతకన్న నమ్మకం ఉంది. చంద్ర‌బాబు గురించి మీకు ఒక విష‌యం చెప్పాలి. ఆయ‌న‌కు అబ‌ద్ధాలు చెప్పే అల‌వాటు ఉంది. గతంలో నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు ఒక ప్రాజెక్టుకు సంబంధించి న‌కిలీ డాక్యుమెంట్లు తీసుకొచ్చారు. అసెంబ్లీలో వాటి గురించి చెబితే ముఖ్య‌మంత్రిగా ఉన్న నాన్న‌కు కూడా అర్థం కాలేదు. ఆ డాక్యుమెంట్ ను ప‌రిశీలిస్తే అది న‌కిలీదిగా గుర్తించారు.

+  అలా ఎందుకు చేశామంటే.. మీరు నిజం చెప్పాలంటే అలా చేయ‌ల‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు అన్నారు. చంద్ర‌బాబు మాదిరి త‌ప్పుడు ప‌నులు ఈ అసెంబ్లీలో ఎవ‌రూ చేయ‌కూడ‌దు. సభలో మోసాలు.. అబద్ధం చెప్పే కార్యక్రమం ఉండకూడదు. సభలో తప్పు చేయద్దు. అవాస్తవాలు చెప్పొద్దు.

+  చర్చ జరిగే అంశంపై పూర్తి అవగాహనతో రావాలి. సభ్యులు సమావేశాలకు గైర్హాజరు కావద్దు.  అసెంబ్లీ ప్రారంభం కావ‌టానికి కనీసం 30 నిమిషాలు ముందు ఉండాలి. ప్రతి పదిమంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్యేలను సమన్వయం కోసం కేటాయిస్తాం. ఈసారి హుందాగా సభ నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం ఉంటుంది.

    

Tags:    

Similar News