ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ఈసారి ఎలాగైనా అధికారం లోకి రావాలని వ్యూహాలను రచిస్తోంది. ఇందులో భాగంగా బహిరంగ సభలు - సమావేశాలకు షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో మొదటి సభ తేదీని ప్రకటించి వైఎస్ జగన్ సమరశంఖం పూరించారు.. వచ్చేనెల 6న తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు స్థానిక లీడర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభతో పార్టీ నాయకుల్లో ఊపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీలో టికెట్ కోసం ఆశావహులు రాయబారాలు నడుపుతున్నారు. దాదాపు ఇదివరకు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ వచ్చే అవకాశం ఉందని కొందరు చెబుతుండగా.. కొన్ని స్థానాల్లో మార్పు ఉంటుందని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే ఇన్ చార్జులే అభ్యర్థులంటూ ఇటీవల కొన్ని స్థానాలకు జగన్ సైన్ చేశారు.
ముఖ్యంగా జమ్మలమడుగు అభ్యర్థిని జగన్ స్వయంగా ప్రకటించారు. దీంతో ఇన్ చార్జులుగా ఉన్న స్థానాల్లో ఆశలు పెరిగాయి. అయితే గతంలో పోటీ చేసి పరాజయం అయిన స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తిరుపతిలో నిర్వహించే సభతో పార్టీ నాయకుల్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.బూత్ లెవల్ నాయకుల్లో తొలగిన సందిగ్ధత కూడా తొలిగిపోయే అవకాశం ఉందని పార్టీలో కొందరు నాయకులు భావిస్తున్నారు.
మరో రెండు నెలల్లో ఎన్నికలు రానుందన ఇప్పటి నుంచే బూత్ లెవల్లో పార్టీని పటిష్టం చేస్తే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటుందని భావించినట్లు సమాచారం. తిరుపతి సభ తరువాత కడప - అనంతపురం జిల్లాల్లోనూ సమర శంఖారావాలు ఉంటాయని తెలుస్తోంది.