తన కేబినెట్ లో మంత్రులను నియమించినప్పుడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓపెన్ గా కొన్ని విషయాలను ప్రకటించారు. మంత్రుల్లో ఎనభై శాతం మంది రెండున్నరేళ్లకే తప్పుకోవాల్సి ఉంటుందని జగన్ మొదట్లోనే ప్రకటించారు. జంబో కేబినెట్ ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గా నిలిచిన జగన్.. రెండున్నరేళ్ల తర్వాత చాలా మందిని సీట్ల నుంచి తప్పించనున్నట్టుగా, వారి స్థానంలో వేరే వాళ్లు వస్తారన్నట్టుగా ప్రకటించారు.
ఇక ఇంతలోనే కొంతమంది మంత్రుల తీరు మీద మాత్రం జగన్ అంత సంతృప్తిగా లేనట్టుగా తెలుస్తోంది. వారు ఎవరు? ఎవరిపై ఎలాంటి అసంతృప్తి ఉంది? వంటి అంశాల గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతూ ఉంది. ఆ మేరకు నెటిజన్లు కొందరు మంత్రుల పేర్లను ప్రస్తావిస్తూ ఉన్నారు. వారిపై ఎలాంటి అసంతృప్తి ఉందో చెబుతూ ఉన్నారు.
ఇదంతా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న స్టోరీ మాత్రమే. ఆ కథనం సారాంశం ఇలా ఉంది.
సీనియర్ మంత్రి బొత్స తీరుపై జగన్ మోహన్ రెడ్డి కినుకతో ఉన్నారట. రాజధాని విషయంలో బొత్స స్టేట్ మెంట్లు తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, పవన్ కల్యాణ్ కు తొలి అస్త్రాలుగా మారిన సంగతి తెలిసిందే. వాటి తీవ్రత ఎంత అయినప్పటికీ.. అవకాశం ఇచ్చింది అయితే మంత్రిగా బొత్స సత్యనారాయణ మాత్రమే. ఈ విషయంపై ఇంకా జగన్ అధికారికంగా ఏమీ స్పందించలేదు కానీ అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచరాం.
ఇక అనిల్ కుమార్ యాదవ్.. ఆయన పెద్దగా నాలెడ్జ్ లేకుండా, మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారనేది జనాభిప్రాయం. నెల్లూరు వాటర్ ఇష్యూ కూడా సాల్వ్ చేయలేకపోతున్నారనే అభియోగాలూ ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో కూడా సఖ్యత లేదని తెలుస్తోంది. ఈ విషయాలపై అనిల్ కుమార్ యాదవ్ నెగిటివ్ రేటింగ్ పొందారట.
అవంతి శ్రీనివాస్ కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం. బోట్ ఇష్యూలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఏ పార్టీలో ఉన్నా అవంతి వివాదాస్పదంగా మారుతూ ఉంటారనే సంగతీ తెలిసిందే.
ఇక ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా మంచి మార్కులు పడటం లేదట. నూతన ఆర్థిక వనరులను కనుగొనడం విషయంలో ఆయన ఫెయిల్యూర్ అవుతున్నారట. అలాగే రైతు భరోసా విషయంలో అరవై లక్షల మంది రైతులకు సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందని సమాచారం.
అనంతపురం జిల్లాకు చెందని మంత్రి శంకర్ నారాయణ తీరుపై కూడా పాజిటివ్ రిపోర్ట్ లేదని సమాచారం. అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లినప్పుడు జనసమీకరణలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారు. అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డితో గొడవ మీడియాలో మైలెట్ అయ్యింది. ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం పాస్ కూడా ఇవ్వలేదు. దీనికంతా బాధ్యత మంత్రిదే అనే ప్రచారం సాగుతూ ఉంది. మంత్రిగా కూడా ఆయన అంత రాణించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ ఉంది.
ఈ అంశాలు సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ ఉన్నాయి. ఇవే అంశాలు సెక్రటేరియల్ లెవల్లో కూడా చర్చనీయాంశంగా మారినట్టుగా భోగట్టా!