వచ్చే కాలంలో జగన్ క్యాబినెట్ ప్రక్షాళనకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు ముహూర్తాలూ సిద్ధం చేస్తున్నారు.జూల్ ఎనిమిదిన ప్లీనరీ తరువాత కీలకం అనుకునే మార్పులకు శ్రీకారంది దిద్ది,అటుపై వాటిని కొనసాగించి ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా క్యాడర్ కు కొన్ని వ్యూహ మరియు ప్రతి వ్యూహాలు అందించనున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలోనూ కొన్ని మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగాఆయనకు పనిచేయని ఎమ్మెల్యేల వివరాలపై విపరీతం అయిన కోపం ఉంది అని తేలిపోయింది. జనంలో లేకుండా తన నామ స్మరణ చేస్తే ఫలితం ఉండదని పదే పదే ఇవాళ్టి వైసీపీ శాసన సభాపక్షం సమావేశంలో తేల్చేశారు.
తాను చేపడుతున్న పథకాలు మరియు మిగతా పనులు అన్నీ కూడా ప్రచారానికి నోచుకోకుండా వాటి వాస్తవిక ఫలితాలు అన్నవి జనంలోకి వెళ్లకుండా ఉంటే క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం ఎలా ఉందో ఎమ్మెల్యేలకు ఎలా తెలుస్తుందని ఇవాళ ఆయన ప్రశ్నించారు అని సమాచారం.
ఇక పనిచేయని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేదే లేదని,ఇప్పటికే వారి డేటా అంతా తన దగ్గర ఉందని స్పష్టం చేస్తూ, జనం మధ్య ఉండని నేతలు తరువాత కాలంలో తనదగ్గర కు టిక్కెట్లు ఇవ్వడంటూ రాకండని తేల్చేశారు. నిర్మోహమాట రీతిలో జగన్ ఇవాళ మాట్లాడారు.
టీడీపీ విమర్శలను తిప్పి కొట్టేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని, గ్రామ సచివాలయాల తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పదే పదే చెప్పారు. ముఖ్యంగా జుట్టు ఉంటేనే ముడేసుకోవచ్చు లేకుంటే ఎలా అని వ్యాఖ్యలు చేసి ఎమ్మెల్యేలను కొందరిని తీవ్ర స్థాయిలో మందలించారు.
నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ తిరగకుండా సర్వేల్లో మీ పేరు కనిపించడం సాధ్యం కాదని అప్పుడు మీరు వచ్చి టిక్కెట్లు అడిగినా ఫలితం ఉండదని అన్నారు జగన్.ఇవన్నీ పరిగణనలో తీసుకుని క్షేత్ర స్థాయిలో పనిచేయాలని మరో మారు చెప్పి పంపారు.