సాటి రెడ్డి లీడర్ అయినా కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వదలలేదు ఈ 'రెడ్డిగారి కూతురు' వైఎస్ షర్మిల. రాజకీయంలోకి వచ్చాక 'రెడ్డి' లేదు గిడ్డీ అంటూ కార్యక్షేత్రంలోకి షర్మిల దూకేసింది. వైఎస్ షర్మిల తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ ను ఆమె వదిలిపెట్టకపోవడం విశేషం.
'అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం' సందర్భంగా వైఎస్ షర్మిల నెటిజన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. పనిలో పనిగా తాను ఒంటరి 'సోషల్ మీడియా' బిడ్డను అని.. టీఆర్ఎస్, బీజేపీల్లా తమకు సోషల్ మీడియా ఉద్యోగులు లేరని ఆవేదన వ్యక్తం చేసింది. తన రాజన్న సైన్యమే తన సోషల్ మీడియా కార్యకర్తలంటూ చెప్పుకొచ్చారు.
ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఎంతో అవసరమని అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుంది... అన్నీ చేయలేనివి చేసేదే 5వ ఎస్టేట్ అని పేర్కొన్నారు. ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధం సోషల్ మీడియా అని వెల్లడించారు. అలాంటి సోషల్ మీడియాకు హ్యాట్సాఫ్ అని షర్మిల తెలిపారు.
ఇక జూలై 8వ తేదీన కొత్త పార్టీ పెడుతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. దానికి పేరు 'వైఎస్ఆర్ టీపీ' అని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో రాజన్న రాజ్యస్థాపనే ధ్యేయంగా పార్టీ పెడుతున్నట్టు చెప్పుకొచ్చారు.
ఇక షర్మిల ఈ సందర్భంగా పంచ్ పొలిటికల్ డైలాగులు పేల్చడం విశేషం. తాను తెలంగాణ రాజకీయాల్లో రాణించాలంటే సోషల్ మీడియా అవసరం ఎంతో ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. నెటిజన్ల సపోర్ట్ లేకుండా తానేం చేయలేనని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీలో తనకు సోషల్ మీడియాకు ఉద్యోగులు లేరని తెలిపారు.తనకు కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులే తన సైన్యమని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా లేకుండా ఎలాంటి పనులు చేయలేమన్నారు.
ఇక రేవంత్ ను వదిలిపెట్టకుండా షర్మిల ఎద్దేవా చేయడం విశేషం. టీడీపీ నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ను చేశారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.