తెలంగాణలో ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు ఖరారు అయినట్టు సమాచారం. ఈ మేరకు ఆమె పార్టీ పేరును ఖరారు చేశారని ప్రచారం సాగుతోంది. ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ (వైఎస్సార్ టీపీ) పేరుతో ఆమె పార్టీ ఏర్పాటు చేయనున్నారని.. ఆ పేరు కోసం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారని సన్నిహిత వర్గాల సమాచారం.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని జులై 8వ తేదీన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ఆర్ సీపీకి దగ్గర ఉన్న ఈ పేరును వైసీపీ అభ్యంతరం పెడితే షర్మిలకు చిక్కులు తప్పవు. కానీ చెల్లెల పార్టీకి జగన్ అడ్డంకులు సృష్టించరని అంటున్నారు.
తన అన్న జగన్ పార్టీ పేరు ‘వైఎస్ఆర్సీపీ’కి దగ్గరగా.. తెలంగాణ పేరు కలిసివచ్చేలా ఉన్నందునే వైఎస్ఆర్ టీపీ పేరును షర్మిల మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విద్యార్థి, మహిళ సంఘాలతో సమావేశమైన షర్మిల తన రాజకీయ ప్రవేశంపై క్లారిటీకి వచ్చారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే బహిరంగ సభబలో ఆమె తన రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టత ఇస్తారని చెబుతున్నారు.
ఇక కొత్త రాజకీయ పార్టీ స్థాపన, దాని విధివిధానాలపై త్వరలోనే స్పష్టత ఇస్తారని నేతలు చెబుతున్నారు. కొత్త రాజకీయ పార్టీ స్థాపన.. దాని విధివిధానాలకు సంబంధించిన వివరాలు అక్కడ వెల్లడించే అవకాశం ఉంది. ఖమ్మం సభ తర్వాత తెలంగాణలోని జిల్లాల్లో పర్యటించనున్న షర్మిల జులై 8న పార్టీ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.