ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు.. జగన్ తల్లి విజయమ్మ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తన రాజకీయ ప్రసంగాల్లో విమర్శలు.. ఆరోపణల కంటే కూడా జగన్ కు ఓటు ఎందుకు వేయాలో చెప్పే ఆమె.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. ఏపీ రాజకీయంలో నెలకొన్న పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారన్న విజయమ్మ.. తన కొడుక్కి ఒక్క అవకాశం ఇవ్వాలన్నారు. ఏపీలో నిజమైన రౌడీ చంద్రబాబేనని.. ఎవరైనా ఎదురు తిరిగితే తాట తీస్తా.. ఫినిష్ చేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
అమరావతి పేరుతో టీడీపీ నేతలు భూదోపిడీ చేస్తున్నారన్నారు. మూడు రోజులు నుంచి చంద్రబాబు అనేక డ్రామాలు ఆడుతున్నారని.. గుండెపోటు వచ్చిందని బాబు నాటకాలు ఆడే అవకాశం కూడా ఉందని ఆమె చెప్పారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆమె కోరారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని.. అలాంటి దొంగ చంద్రబాబు.. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడుగా ఆమె మండిపడ్డారు. భన్వర్ లాల్ కు.. రోజాకు సంబంధం ఉందని చెప్పటానికి చంద్రబాబుకు సిగ్గుందా? అని ప్రశ్నించిన విజయమ్మ.. ఆడవాళ్లను గౌరవించే విధానం ఇదేనా? అని ప్రశ్నించారు. బాబు ఆడే నాటకాన్ని ముందుస్తుగా హెచ్చరించిన విజయమ్మ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
విజయమ్మ చేసిన మరిన్ని వ్యాఖ్యలు చూస్తే..
- జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారు.
- గత ఐదేళ్ల కాలంలో రైతులను - నిరుద్యోగులను టీడీపీ ప్రభుత్వం విస్మరించింది.
- వైఎస్ జగన్ను సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటారు.
- రాష్ట్రంలో 2లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం భర్తీ చేయడంలేదు. జగన్ సీఎం అయిన వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
- నా పుట్టినిల్లు అనంతపురం జిల్లానే. ఈ జిల్లా మనమడైన జగన్ ను ప్రజలంతా దీవించాలి.
- మైనార్టీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు
- కులాలు - మతాలు - పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది.
- చివరి వరకూ ప్రజల సంక్షేమం కోసమే తపించి.. ప్రజలే ముఖ్యమని వెళ్తూ వైఎస్సార్ మరణించారు. జగన్ పై అనేక అక్రమ కేసులను పెట్టి.. ఎన్నో హింసలకు గురిచేశారు.