తెలుగోళ్లనందరికీ భారీ షాక్ తగిలింది వైఎస్ మరణం. కలలో కూడా ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ వైనం తెలుగు రాజకీయాల్లో తీరని ప్రభావాన్ని చూపించటమే కాదు.. రెండు రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైందనటంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్ కానీ బతికి ఉంటే.. రాష్ట్రం ముక్కలయ్యే ఛాన్స్ లేదనే మాటను చాలామంది చెబుతుంటారు.
వైఎస్ మరణం తర్వాత జగన్ పార్టీ పెట్టటం ఒక ఎత్తు అయితే.. అసలు పార్టీ పెట్టే పరిస్థితులు ఎలా చోటు చేసుకున్నాయి? వైఎస్ మరణించిన వేళ.. జగన్ బాధ్యత తాను తీసుకుంటానని చెప్పిన సోనియా.. తర్వాత కాలంలో ఆయనపై ఎందుకు సీరియస్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేయాల్సిన పరిస్థితులు ఎలా చోటు చేసుకున్నాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికే వచ్చినా.. విజయమ్మ నోటి నుంచిరావటం ఆసక్తికరమైన అంశం. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయమ్మ.. గతం తాలూకు విషయాల్ని ప్రస్తావించారు. ఇంతకీ ఆమేం చెప్పారన్నది ఆమె మాటల్లోనే చూస్తే..
"రాజశేఖరరెడ్డి పోవడమే మాకు పెద్ద షాక్. ఆయన దాదాపు 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి రాజశేఖరరెడ్డి నచ్చలేదు. జగన్ నచ్చలేదు. ఆయన ద్వారా పైకి వచ్చినవారు, సహచరులు - ఆయనతో చాలా దగ్గరగా ఉన్న వారు ఎవరూ ఈ కుటుంబ పక్షంగా నిలబడకపోవడం చాలా బాధగా అనిపించింది. అన్యాయంగా కేసులు పెట్టి జగన్ ను వేధించారు. జైలులో పెట్టించారు. ఎన్నో ఇబ్బందులను ఈ కుటుంబం ఎదుర్కొంది. అయినా జగన్ ధైర్యంగా ముందుకెళ్తున్నాడు"
"కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని జగన్ ఎప్పుడూ అనుకోలేదు. పొమ్మనలేక పొగబెడతారన్నట్లుగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు సృష్టించారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నా వద్దన్నాడు. ఓదార్పు యాత్రకు అనుమతి తప్ప మరేమీ అడగలేదు. అందరూ మాతో బాగానే ఉండేవారు. కానీ సోనియా గాంధీకి - కేంద్రంలోని వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చారు. సంతకాలు జగనే పెట్టించాడన్నట్లుగా ఆమెకు రిపోర్టులు పంపించినట్లు ఉన్నారు. ఆమె దాన్నే చాలా సీరియస్ గా తీసుకున్నట్లున్నారు"
"రాజశేఖరరెడ్డికి అంత మంచి పేరు ఉందని కాంగ్రెస్ వారు కూడా ఊహించలేదనుకుంటా. ఒక జిల్లాలో యాత్ర చేయడానికి అనుమతించారు. ఆ జిల్లాలో ప్రజలు రాజశేఖరరెడ్డిపై ఉన్న ప్రేమనంతా జగన్ పై చూపించారు. ఇది కాంగ్రెస్ వారికి నచ్చలేదనుకుంటా. అందుకే ఓదార్పు యాత్ర వద్దని ఆపించారు. తర్వాత మేం పరిస్థితులను వివరించడానికి అవకాశం ఇవ్వడంటూ సోనియా గాంధీకి లేఖ రాశాం. ఐదు వారాల తర్వాత సోనియాగాంధీ పిలిచారు. దీంతో నేను - షర్మిళ - జగన్ - భారతమ్మ కలిసి వెళ్లాం"
‘మీరు రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదు. ఒకేచోటకు అందరినీ పిలవండి. ఒక విగ్రహమే పెట్టండి. అంతకు మించి తిరగొద్దు. ఇది పార్టీ నిర్ణయం’ అని సోనియా చెప్పారు. షర్మిళ కళ్లల్లో నీరు పెట్టుకుని అడిగారు. ‘నాన్న మరణవార్త విని తట్టుకోలేక మరణించిన వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించడమే సరైన పద్ధతి’ అని షర్మిళ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఒకచోటకు పిలవాలనడం మాకు నచ్చలేదు. అందుకే ఇచ్చిన మాట మేరకు జగన్ ఓదార్పు యాత్ర చేయాల్సిందేనని నిర్ణయించుకుని బయటకు వచ్చారు"
"ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. యాత్రకు వెళ్లొద్దు - సహకరించొద్దంటూ మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలను కట్టడి చేశారు. తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. పార్టీలోనే ఉంటే ముఖ్యమంత్రిని చేస్తారు, బయటకు వెళ్లవద్దని చెప్పారు"
"పార్టీ నుంచి జగన్ బయటకు వెళ్లక తప్పని పరిస్థితి సృష్టించారు. కడప జిల్లాకే పరిమితం చేశారు. మా ఇంట్లో తన నుంచి చిన్నాన్నను విడదీసేందుకు జరిగిన కుట్ర జగన్ కు నచ్చలేదు. ఇక ఆ పార్టీలో మనం మన్నన పొందలేమమ్మా, బయటకు వెళ్లిపోదామని అన్నాడు. జగన్ అలా అడిగినప్పుడు సమంజసమే అని అనిపించింది"
"ఎమ్మెల్యేలతో జగన్ సంతకాలు పెట్టించాడన్న అపవాదు చాలా తప్పు. రాజశేఖరరెడ్డి మరణంతో మేము షాక్ లో ఉన్నాం. సంతకాలు పెట్టించిన సంగతి కూడా జగన్ కు తెలియదు. సీఎం కావాలని జగన్ అనుకోలేదు. కాబట్టే రోశయ్య గారిని ముఖ్యమంత్రి చేద్దామంటే ఒప్పుకున్నారు. రఘువీరారెడ్డి - మరికొందరు వచ్చి ఒప్పుకోవద్దని చెప్పారు"
"కాంగ్రెస్ లో ఉన్నంత కాలం రాజశేఖరరెడ్డి - జగన్ మంచివాళ్లు. పార్టీ పెట్టాలని నిర్ణయించడంతోనే కాంగ్రెస్ వారికి చెడ్డవాళ్లయిపోయారు. అలా అనుకున్న వారంలోనే నోటీసులు వచ్చాయి, ఆ వెంటనే కేసులు పెట్టారు. ఈ రోజు ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆధారాలున్నా ఏమీ చేయడం లేదు. కానీ ఆ రోజు కోర్టుకెవరో లేఖ రాస్తే దాన్ని సీరియస్ గా తీసుకొని ఈ కేసులన్నీ నడిపించారు. కాంగ్రెస్ - టీడీపీలు కలిసి కేసులు పెట్టాయి.కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వెళ్తే కష్టపడతావని అన్నాను. అలా అంటే న్యాయం, ధర్మం అనేవాడు. అబద్ధం చెప్పడం జగన్ కు రాదు. న్యాయంగా వెళ్తూ కేసులన్నీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అన్నిటికీ దేవుడున్నాడనేది అతడి నమ్మకం. మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదంటాడు"
"ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక్కటే చెబుతున్నాను. జగన్ మాట తప్పే మనిషికాదు. ఒక తల్లిగా అతడి వ్యక్తిత్వం నాకు తెలుసు. మాట ఇస్తే పూర్తిగా కట్టుబడి ఉంటాడు. జగన్ ను ఆశీర్వదించండి. ఒక్కసారి అవకాశమివ్వండి. జగన్ అన్నీ చేస్తాడని మాట ఇస్తున్నా. జగన్ కు జీవితమే అన్నీ నేర్పిస్తోంది. ఎక్కడ బస్సు - రైలు ప్రమాదం జరిగినా - వరదలొచ్చి ఎవరైనా చనిపోయినా వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను ఓదార్చుతాడు. ప్రయాణాల్లోనే గడుపుతున్నాడు. ఇంట్లో ఉండేది ఎప్పుడని అడిగితే, మన బాధ్యత మనం నెరవేర్చాలి కదమ్మా అంటుంటాడు. వైఎస్సారే మనకు ఆదర్శం. ఆయన ఏనాడూ అబద్ధం ఆడలేదు. ఆయన చెప్పినవి చేశారు. చెప్పనివీ చేశారు. ప్రజల్లో నమ్మకం కలిగించి వెళ్లారు"