జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం...రేపు విజ‌య‌మ్మ ప్రెస్ మీట్!

Update: 2018-11-10 11:50 GMT
గత నెల 25న వైఎస్సార్‌ సీపీ అధినేత - ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘటనను చిన్న దాడిగా చెప్పిన ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ ఘ‌ట‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌తో ద‌ర్యాప్తు చేయించాల‌ని వైసీపీ నేత‌లు - జ‌గ‌న్ హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఆ దాడి ఘ‌ట‌న‌పై  వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులెవరూ మీడియాతో మాట్లాడలేదు. ఈ నేప‌థ్యంలో తొలిసారిగా జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం ఘటనపై వైఎస్సార్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు - వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ స్పందించనున్నారు.  ఆదివారం ఉద‌యం 11 గంటలకు వైఎస్‌ విజయమ్మ ఆ ఘ‌ట‌న గురించి మీడియాతో మాట్లాడుతారని వైస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

మ‌రోవైపు, గాయం నుంచి కోలుకుంటోన్న జ‌గ‌న్ ....ప్రజా సంకల్పయాత్రను తిరిగి చేప‌ట్టాల‌ని భావిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నవంబర్‌ 12 నుంచి త‌న పాద‌యాత్ర‌ను జ‌గ‌న్ తిరిగి ప్రారంభించనున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర వివ‌రాల‌ను  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో  వెల్ల‌డించారు. ఆదివారం సాయంత్రమే జగన్‌ సాలురుకు బ‌య‌లుదేరి వెళ్లనున్నారు. సోమవారం ఉదయం విజయనగరం జిల్లా సాలూరు నుంచి ప్రజాసంకల్ప యాత్ర పునఃప్రారంభం కానుంది. అలుపెరుగ‌ని జ‌ననేత  జగన్ ఇప్ప‌టివ‌ర‌కు 294 రోజులుపాటు పాదయాత్ర చేశారు. 3 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా నిర్విరామంగా న‌డిచారు.
Tags:    

Similar News