వైఎస్ వివేకాహత్య కేసు: అతడికి నార్కో టెస్ట్ యే ఫైనలా?

Update: 2021-12-29 08:30 GMT
ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి.. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు చిక్కుముడి ఇప్పటికీ వీడడం లేదు. ఎంతో మందిని విచారించినా ఎక్కడా తెగడం లేదు. అసలైన నిందితుడు ఎవరన్నది తేలడం లేదు. ఒక్కోరోజు ఒక్కో నిందితుడి పేరు వినిపిస్తోంది.

తాజాగా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపైనే నిందితులు ఆరోపణలు చేస్తూ కోర్టులకు పోలీసుల వద్దకు వెళుతుండడం సంచలనమైంది. దీంతో సీబీఐ అధికారులు కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ కేసును చేధించడానికి సీబీఐ అధికారులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

సీబీఐ అధికారుల ముందు ఇప్పుడు కీలక ఆధారంగానే శివశంకర్ రెడ్డి ఉన్నారు. అతడిని నార్కో పరీక్షలు నిర్వహిస్తే మొత్తం బయటపడుతుందని నమ్ముతున్నారు. అందుకే కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఎవరికైనా నిందితులకు నార్కో పరీక్షలు నిర్వహించాలంటే వారి అనుమతి తప్పనిసరి. తమ అంగీకారం లేకుండా నార్కో టెస్ట్ చేయడానికి లేదు. శివశంకర్ రెడ్డి కూడా నార్కోటెస్ట్ కు వ్యతిరేకంగానే ఉన్నారు.

నార్కో టెస్ట్ వద్దంటే శివశంకర్ రెడ్డితోపాటు అవినాష్ రెడ్డిపైన కూడా అనుమానాలు కలగడానికి ఆస్కారం ఏర్పడింది. నిజాలు బయటకు వస్తాయనే వారు నార్కోటెస్టుకు దూరంగా ఉన్నారని విమర్శలు వినిపిస్తాయి.

ఈ క్రమంలోనే సీబీఐకి సహకరించవద్దన్న ఆలోచలనలో శివశంకర్ రెడ్డి వర్గం ఉంది. అందుకే విమర్శలు వచ్చినా అనుమానాలు వచ్చినా కొత్తవేం కాదు కాబట్టి నార్కో పరీక్షలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు.


Tags:    

Similar News