వైసీపీకి వ‌రంగ‌ల్ స‌రైన ప్ర‌త్యర్థి ఎవ‌రంటే...

Update: 2015-11-24 15:24 GMT
తెలంగాణ వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించిన వరంగల్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో అనేక ఆస‌క్తిక‌రమైన విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ మొద‌టి నుంచి ఫుల్ జోష్‌ తో ఉండి విజ‌యంపై పూర్తి న‌మ్మ‌కం పెట్టుకుంది. అనుకున్న‌ట్లే ఆ పార్టీ అభ్య‌ర్థి ప‌సునూరి ద‌యాక‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. పూర్తిస్థాయిలో ఫలితాలు వెలవడిన త‌ర్వాత లెక్క‌లు చూస్తే ఇందులో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు ఎన్నో ఉన్నాయి.

టీఆర్‌ ఎస్‌ కు మొత్తం 6,15,403 ఓట్లు వచ్చాయి. టీఆర్‌ ఎస్ అభ్యర్థిగా బ‌రిలో నిలిచిన‌ పసునూరి దయాకర్ 4,52,092 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  కాంగ్రెస్ 1,56,315 ఓట్లు - బీజేపీ 1,30,178 ఓట్లు పోలయ్యాయి. అయితే డిపాజిట్లు దక్కాలంటే లక్షా 73 వేల ఓట్లు రావాలి. బీజేపీ - కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి తప్ప.. కానీ కనీస పోటీని కూడా ఇవ్వక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక గెలుపై ధీమాతో రంగంలోకి దిగిన‌ వైసీపీకి 23,222 ఓట్లు ల‌భించాయి. ఆ పార్టీ అభ్య‌ర్థి న‌ల్లా సూర్య‌ప్రకాశ్ ఓట్ల ప‌రంగా చూస్తే పోటీప‌డింది నోటా(పైవారెవ‌రు కాదు) అనే ఆప్ష‌న్‌ తో కావ‌డం ఆస‌క్తిక‌రం. నోటాకు 7691 ఓట్లు ద‌క్క‌గా అంత‌కు కేవ‌లం మూడు రెట్లు మాత్ర‌మే వైసీపీకి ద‌క్కాయి. మొత్తంగా రెండు రాష్ర్టాల్లో ఉన్న పార్టీ, ఆంధ్ర‌ప్రదేశ్‌ లో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీ..పై వారెవ‌రూ కాదు అనే ఆప్ష‌న్‌ తో పోటీప‌డం ఆస‌క్తిక‌రం.

ఉప ఎన్నిక‌ల ఫ‌లితాన్ని ఓట్ల శాతంలో చూస్తే... అధికార టీఆర్‌ ఎస్‌ కు 60 శాతం ఓట్లు, కాంగ్రెస్‌ కు 15 శాతం, బీజేపీకి 12 శాతం ఓట్లు పోలయ్యాయి. తీర్పు, వైసీపీకి వ‌చ్చిన ఓట్ల‌పై వైసీపీ అభ్య‌ర్థి న‌ల్లా సూర్య‌ప్ర‌కాశ్ స్పందిస్తూ ప్ర‌జ‌ల కోసం అందుబాటులో ఉంటామ‌ని అన్నారు. గెలుపు ఓట‌ములు రాజ‌కీయాల్లో స‌హ‌జ‌మేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.
Tags:    

Similar News