తమ వెర్షన్ ను చెప్పే ముందు అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు - మంత్రులు ఎంత అలర్ట్ గా ఉంటున్నారో - వారి తీరు ఎంత డొల్లగా ఉందో తెలిపే అంశం ఇది. ప్రభుత్వ నివేదికలను పట్టుకుని వారు అసెంబ్లీకి వచ్చేస్తూ ఉన్నారు. ఆ నివేదికలు ఏమో చంద్రబాబు హయాంలో తయారు అయినవి. వాటిల్లో చంద్రబాబు నాయుడు గొప్పదనం చెప్పుకోవడానికి తప్పుడు నంబర్లను జోడించారు. ఆ నంబర్లను పట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు సభలో మాట్లాడుతూ ఉండటం గమనార్హం.
ఈ అంశం మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి - మాజీ మంత్రి నారా లోకేష్ ల మధ్యన శాసనమండలిలో జరిగిన చర్చకు సంబంధించిన వ్యవహారం. గత ఐదేళ్లలో ఏపీలో ముప్పై వేల ఐటీ ఉద్యోగాలు వచ్చినట్టుగా మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ పాయింట్ ను లోకేష్ పట్టుకున్నారు. 'మీరే ఒప్పుకుంటున్నారు ముప్పై వేల జాబ్స్ వచ్చాయని..' అంటూ లోకేష్ అన్నాడు.
అవన్నీ రికార్డుల్లోని మాటలు - కేవలం ప్రభుత్వ నివేదికలే అనేది చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోయే అంశం. వాటిల్లో సగానికి సగం కల్పనలే ఉంటాయి. అందులో నిజానిజాలను తేల్చాల్సిన అంశం ప్రస్తుత ప్రభుత్వం పని. ఏపీలో నిజంగా ముప్పై వేల మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగం చేస్తున్నారా? అనేది సామాన్యులకు కూడా తెలిసే అంశమే. ఏపీలోని ఐటీ ఉద్యోగులు అంటే.. వారిలో హైదరాబాద్ - బెంగళూరు - పుణేలతో మొదలుకుని నొయిడా - గుర్గావ్ ల వరకూ వెళ్లి పని చేసే వాళ్లే ఉంటారు!
అయితే గత ప్రభుత్వం ఏమో ముప్పై వేల మందికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా నివేదికలు తయారు చేసింది. వాటినే తీసుకొచ్చి కొత్త మంత్రి చదివేశారు. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు.
తాము ఏ రికార్డులను పట్టుకుని చదువుతున్న విషయాన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు గమనించకపోవడం గమనార్హం.