అబద్ధాన్ని నిజంగా నమ్మించటం ఒక అర్ట్. ఆ విషయంలో అప్పుడెప్పుడోనో పీహెచ్ డీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తనకు అలవాటైన ఈ విద్యను తన కొడుకు లోకేశ్ మొదలు.. పార్టీ మొత్తానికి వ్యాపింపచేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. అంతేనా.. ఈ వ్యవహారంలో తనకు అండగా నిలిచే మీడియాకు సైతం బాగానే అలవాటు చేశారు బాబు.
ఎందుకంటే.. ఆయన్ను ఆకాశానికి ఎత్తేసే క్రమంలో.. ఆయన రాజకీయ ప్రత్యర్థులపై లేని పోని బురద చల్లే విషయంలో పచ్చ మీడియా ఎప్పుడూ ముందు ఉంటుంది. అంతేనా.. బాబు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే వార్తల్ని అండర్ ప్లే చేయటం.. జగన్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉన్న వార్తలకు సరిగా ప్రయారిటీ ఇవ్వకపోవటం మొదట్నించి ఉన్నదే.
ఈ మధ్యన ఈ వ్యవహారం మరింత ఎక్కువైంది. ఏపీలో వైఎస్ జగన్ పాదయాత్రకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఆయన వార్తల్ని వేయటానికి పచ్చ మీడియాకు ఏ మాత్రం మనసు ఒప్పని పరిస్థితి.
అంచనాలకు మించి పోటెత్తుతున్న జనాదరణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ అధికారపక్షం.. పచ్చ మీడియాలు ఏం చేయాలో పాలు పోని పరిస్థితి. అందుకే.. గుడ్డు మీద ఈకలు పీకేలా.. జగన్ మాటలకు వక్రభాష్యం చెబుతూ గ్లోబల్ ప్రచారానికి తెర తీస్తున్నారు.
అదే సమయంలో.. జగన్ పై చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తూ ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. వాటి మీద తమ్ముళ్లు స్పందించటం లేదు. అదే సమయంలో వారికి అనుకూలమైన మీడియాలో ఆ వార్తలు రాని పరిస్థితి. జగన్ కు మోడీకి మధ్య రహస్య సంబంధం ఉందని.. తెర వెనుక వారేదో ఒప్పందం చేసుకున్నట్లుగా తరచూ ఆరోపణలు చేస్తుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన అనుచర వర్గం. మరి.. అదే నిజమైతే.. నిన్న జరిగిన ప్రజాపద్దుల ఎన్నికల్లో మోడీ వర్గానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.ఈ వార్తకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.
అంతేనా.. తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల అంశంలోనూ మోడీకి వ్యతిరేక స్టాండ్ తీసుకుంటోంది వైఎస్సార్ కాంగ్రెస్. ఆ వార్తకు కూడా పచ్చ మీడియా పెద్ద ప్రాధాన్యత ఇవ్వదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఇదే అంశంపై జగన్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు తమ మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పింది. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. మోడీతో రహస్య ఒప్పందం ఉంటే.. ఇలాంటి నిర్ణయాన్ని ఎలా తీసుకోగలుగుతారు?