వైసీపీ ప్రభంజనం..జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్

Update: 2019-05-23 07:44 GMT
ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ కూడా ఇంతటి భారీ విజయాన్ని ఊహించి ఉండదు.. ప్రజలు,. ఎగ్జిట్ పోల్స్ కూడా 110-120 మధ్యనే అంచనా వేశాయి.కానీ ఇలాంటి అపూర్వ విజయాన్ని వైసీపీకి ఏపీ ప్రజలు కట్టబెట్టారు. ఇది జగన్ జీవితంలోనూ అద్వితీయ విజయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏపీ వ్యాప్తంగా వైసీపీకి పట్టున్న రాయలసీమలోనే కాదు.. టీడీపీకి పట్టున్న గోదావరి  - గుంటూరు - ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీపై నరనరాన వ్యతిరేకతను ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చాటిచెప్పారు.

ఏపీ ప్రజలకు వైసీపీపై అభిమానం.. టీడీపీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే..ఏకంగా మొత్తం 13 జిల్లాల్లో రెండు జిల్లాల్లో టీడీపీ ఇంతవరకూ ఖాతా తెరవకపోవడం సంచలనంగా మారింది.  ఇక కొన్నిజిల్లాల్లో ఒకటి - రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ లీడ్ లో ఉండడం టీడీపీ దారుణ ఓటమి దిగా సాగుతుందని చెప్పవచ్చు..

+మధ్యాహ్నం 1 గంట వరకు కౌంటింగ్ సరళిని బట్టి చూస్తే జిల్లాల వారీగా ఫలితాలివీ..

గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ -12 ,
టీడీపీ -5  ,
జనసేన- 0 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉంటే
వైసీపీ- 13 
 టీడీపీ-  3
జనసేన- 0 

నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే..
వైసీపీ -9
టీడీపీ-1
జనసేన-0

కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ -10
టీడీపీ -0
జనసేన -0

అనంతపురం లో 14 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ-12
టీడీపీ-02
జనసేన-0

కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ -13
టీడీపీ-1
జనసేన-0

చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ -13
టీడీపీ -01
జనసేన -0

ఒంగోలులో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ-8
టీడీపీ-4
జనసేన -0

పశ్చిమ గోదావరిలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ-14
టీడీపీ -1
జనసేన-0

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ -12
టీడీపీ-06
జనసేన -01

విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ -10
టీడీపీ-05
జనసేన -0

విజయనగరం జిల్లాలో మొత్తం 09 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ -9
టీడీపీ-0
జనసేన-0

శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే
వైసీపీ-8
టీడీపీ-02
జనసేన-0
Tags:    

Similar News