టీడీపీ కి మరోషాక్ ... ఆందోళన బాట పట్టిన వైసీపీ !

Update: 2020-01-25 05:49 GMT
ఏపీకి మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద వివాదంలా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అసెంబ్లీ లో మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి మండలికి పంపిస్తే అక్కడ ఆ బిల్లుని అడ్డుకున్న టీడీపీ ..ఆ బిల్లుని సెలెక్టెడ్ కమిటీకి పంపింది. అధికార వికేంద్రీకరణపై శాసన సభ, మండలిలో టీడీపీ వ్యవహరించిన తీరు పై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనితో ఇప్పుడు టీడీపీ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపడానికి సిద్ధం అయ్యింది.

మొత్తంగా మూడు ప్రాంతాల అభివృద్ధి కి విఘాతం కలిగిస్తున్నారని టీడీపీ పై తీవ్ర ఆగ్రహం తో ఉన్న వైసీపీ ఆందోళనల బాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వరుస నిరసనలు, ఆందోళనలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అధికార, పరిపాలన వికేంద్రీకరణ తో రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెయ్యాలని ,13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కీలక నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేటి నుండి తల పెట్టిన ఆందోళనల కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జ్ లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ నేతలు షెడ్యూల్‌ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా 25వ తేదీ శనివారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వద్ద చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయనున్నారు. 27వ తేదీనాడు యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో బైక్ ర్యాలీలు, పాద‌యాత్ర‌లు నిర్వహించనున్నారు. 28 వ తేదీన పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వ‌ర్యంలో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణపై యూనివ‌ర్సిటీల వ‌ద్ద స‌ద‌స్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 29 వ తేదీన పార్టీ యువ‌జ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో సంత‌కాల సేక‌ర‌ణ‌ నిర్వహించాలని కార్యాచరణ రూపిందించారు. అలాగే 30 వ తేదీన వికేంద్రీక‌ర‌ణ విష‌యంలో టీడీపీ తీరుపై రాష్ట్రప‌తికి పోస్టుకార్డులు పంపే ఉద్య‌మం చెయ్యాలని, 31వ తేదీన తాడేప‌ల్లి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మూడు ప్రాంతాల జేఏసీ నాయ‌కుల స‌మావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు తగులుతున్న చంద్రబాబును , టీడీపీని ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని , తద్వారా ప్రజలకు మూడు రాజధానుల నిర్ణయం ఆవశ్యకత తెలియజెయ్యాలని వైసీపీ భావిస్తుంది.
Tags:    

Similar News