-పోలింగ్ మొదలవల్లడానికి కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. మిగిలిన సమయం తక్కువే అయినా..పార్టీలకు ఇది అంత్యంత క్లిష్టమైన సమయం. ఈ సమయంలో పార్టీలు కొన్ని కీలకమైన అంశాల మీద దృష్టి పెట్టాయి.
-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ధన ప్రవాహం విషయంలో ఆ పార్టీ బాగా ఆందోళనకు గురి అవుతోంది.
-ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు రకాలుగా మేనేజ్ చే సఅవకాశాలున్నాయి. సరిగ్గా పోలింగ్ కు ముందు రోజున డ్వాక్రా మహిళలకు - రైతులకు ఎంతో కొంత డబ్బు చేతికి అందేలా చంద్రబాబు నాయుడు ప్లాన్ అమలు పరుస్తూ ఉన్నారు.
-అయితే ఈ అంశంలో తెలుగుదేశం కూడా కొంత ఆందోళనలోనే ఉంది. పోలింగ్ ముందు రోజులోగా జనాలకు డబ్బులు అందుతాయా లేదా.. అనేది సందేహంగానే ఉండటంతో టీడీపీలోనూ ఈ అంశంపై ఆందోళన నెలకొని ఉంది.
-ఇక అధికార పార్టీ వాళ్లు కోట్ల రూపాయలు కూడబెట్టిన వైనం ప్రస్ఫుటం అవుతోంది. దీంతో వారు భారీ ఎత్తున నోట్ల కట్టలను తెంచుతూ ఉన్నారు. కొన్ని చోట్ల టీడీపీ ఓటుకు ఐదారు నుంచి పదివేల రూపాయలు కూడా ఇస్తోందనే ప్రచారం సాగుతూ ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డబ్బుల పంపకం విషయంలో టీడీపీతో పోటీ పడే పరిస్థితులో లేదని స్వయంగా పవన్ కల్యాణే వ్యాఖ్యానిచడం గమనార్హం.
-ఇక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు అలర్ట్ గానే కనిపిస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బాగా మార్పు కనిపిస్తూ ఉండటం విశేషం. అప్పుడు తాము ఓటేస్తే చాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫీలయ్యారు.
-ఈ సారి మాత్రం తాము ఓటు వేయడమే కాకుండా..తమ తమ వార్డుల్లో, గ్రామాల్లో వేయించడం మీద కూడా వారు కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింతగా మెరుగుపడాల్సి ఉంది.
-ఇక మీడియాను ఎదుర్కొనడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారింది. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు.. తెలుగుదేశం అనుకూల మీడియా ఎక్కడిక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏదో రకమైన నెగిటివ్ పబ్లిసిటీని ఆయా జిల్లాల, నియోజకవర్గాల ఎడిషన్లలో కూడా చేస్తోంది టీడీపీ మీడియా.
-దీన్ని ఎదుర్కొనడానికి కొంత వరకూ సాక్షిని ఉపయోగించుకుంటున్నారు, మరి కొంతగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. అయితే తెలుగుదేశం మీడియా మాత్రం ఆఖరి నిమిషం వరకూ తన ప్రయత్నాలను కొనసాగించేలా కనిపిస్తూ ఉంది.
-ఈ రోజు రాత్రికి, రేపు..చాటు మాటన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను - అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే పనులను నియంత్రించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్. ఐదేళ్లు ఒక ఎత్తు - రేపు –ఎల్లుండి మరో ఎత్తు!