రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు నో..వైసీపీ వాకౌట్‌

Update: 2017-03-25 06:11 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు శ‌నివారం హాట్ హాట్‌ గా ప్రారంభం అయ్యాయి. మిర్చి - వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు - ధరల స్థిరీకరణపై చర్చించాలని కోరుతూ ప్ర‌ధాన‌ ప్రతిపక్షమైన వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే స్పీక‌ర్ దీనికి చ‌ర్చ‌కు నిరాక‌రిచారు. దీంతో తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైసీపీ పట్టుబట్టింది. అయితే స్పీక‌ర్ అందుకు నిరాక‌రిస్తుండ‌టంతో వైసీపీ సభ్యులు వెల్‌ లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

వాయిదా అనంత‌రం వైసీపీ స‌భ్యులు తిరిగి చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టారు. రైతుల కంటే ముఖ్య‌మైన స‌మ‌స్య‌లు ఏముంటాయ‌ని ప్ర‌శ్నించారు. అయితే అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డంతో శాసనసభ నుంచి ప్రతిపక్ష నేత జగన్‌ తో పాటు వైసీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. ఉపాధి హామీ అమలులో ప్రభుత్వ వైఖరికి నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News