జానీమూన్ ముందు నిరసన తెలిపిన ఎమ్మెల్యే

Update: 2016-12-30 13:59 GMT
కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాల విధానాల‌పై త‌న‌దైన శైలిలో నిర‌స‌న తెల‌ప‌డంలో ముందుండే మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యంలోనూ త‌నదైన శైలిలోవ్య‌వ‌హ‌రించారు. ఈ రోజు గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం ప్రారంభం నుండి సమావేశం ముగిసే వరకు నిలబడి ఉండి త‌న‌ నిరసనను తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నోట్ల‌ ర‌ద్దు ప్ర‌క‌టించిన స‌మ‌యంలో చెప్పి 50 రోజులు దాటినప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు ఇంకా స‌మ‌స్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికీ క్యూల్లో - మహిళలు - వృద్దులు ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడుతూనే ఉంటున్నారని ఆర్కే పేర్కొన్నారు.

నల్లధనానికి తాను పూర్తి వ్యతిరేకమ‌ని తెలిపిన ఆర్కే...జననాలు - మరణాలను క్యూల్లో చూస్తుండ‌టం బాధ‌క‌ర‌మ‌న్నారు. అలాగే బ్యాంకు అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారని మ‌రోవైపు నల్ల కుబేరులు కోట్లాది రూపాయలు ఇంకా కూడబెట్టుకుంటూనే ఉన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఈ ఘోర వైఫల్యాలకు మరియు సామాన్య ప్రజల ఇబ్బందులకు నిరసనగా గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం ప్రారంభం నుండి సమావేశం ముగిసే వరకు నిలబడి ఉండి నిరసనను తెలియజేశాన‌న‌న‌ని ఆర్కే మీడియాతో వివ‌రించారు. ప్ర‌భుత్వం మాట‌ల‌కు, ప్ర‌చారాల‌కు ప‌రిమితం కాకుండా కార్యాచ‌ర‌ణ‌ను మొద‌లుపెట్టాల‌ని ఆర్కే కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News