మరో జగన్ ఎమ్మెల్యే జంపింగ్ కు రెడీ

Update: 2016-06-07 05:07 GMT
ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీ విపక్షం నుంచి అధికారపక్షంలోకి ఎమ్మెల్యేల్ని తీసుకొచ్చే ప్రక్రియ మాజోరుగా సాగుతోంది. ఇప్పటికే 19 మంది ఎమ్మెల్యేల్ని అధికారపార్టీలోకి తీసుకొచ్చిన తెలుగు తమ్ముళ్లు.. మరో ఎమ్మెల్యేను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఓపక్క ఏపీ ముఖ్యమంత్రిపై విపక్ష నేత నిప్పులు చెరుగుతుంటే.. మరోవైపు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా కావటం గమనార్హం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి జంప్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు అమర్ నాథ్ రెడ్డి సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తి అయినట్లు సమాచారం.

అన్ని అనుకున్నట్లు సాగితే..అమర్ నాథ్ రెడ్డి టీడీపీ లో చేరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. సైకిల్ ఎక్కేందుకు అమర్ నాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ వాదనను నిజం చేస్తూ.. అమర్ నాథ్ రెడ్డి తన సన్నిహితులు.. నేతలు.. కార్యకర్తలతో భేటీ కావటం.. టీడీపీలో చేరితే ఎలా ఉంటుందన్న సలహాల్ని స్వీకరించటం చూస్తుంటే.. జగన్ పార్టీ ఎమ్మెల్యే మరొకరు జంప్ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News