మూడు రోజులుగా ఏపీలో పర్యటిస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందనలు ఘాటుగా వస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ప్రజారాజ్యం పెట్టినట్లుగా చెప్పిన చిరంజీవి.. ఆ పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలుపుతుంటే.. వద్దని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పరకాల ప్రభాకర్ లాంటి వల్లే ప్రజారాజ్యానికి ఆ గతి పట్టిందన్నారు. పరకాల లాంటి వాళ్లను పట్టుకొని వదలను అనటంలోనే పవన్ పిరికితనం ఏమిటో అర్థమవుతుందన్నారు.
పరకాల లాంటి సైడ్ క్యారెక్టర్లను తిడితే ఉపయోగం ఉందడన్న ఆయన.. సైడ్ క్యారెక్టర్లను తిడితే హీరోయిజం అనిపించుకోదన్నారు. పవన్ కల్యాణ్ మొదట తానున్న సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు.. మాఫియా మీద పోరాడిన తర్వాత ప్రజల కోసం పోరాడాలన్న సూచన చేశారు. తనకు భయం లేదని.. జైలుకు వెళ్లటానికైనా సిద్ధమేనని చెబుతున్నారని.. అయితే తమకు కూడా భయం లేదని.. జైలుకు వెళ్లటానికి రెఢీ అని వ్యాఖ్యానించారు.
జగన్ గురించి అనవసరంగా అవాకులు.. చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు అనిల్. ఊహించనిరీతిలో పవన్ పై రియాక్ట్ అవుతున్న జగన్ ఎమ్మెల్యేలు లాజిక్ తో కొత్త పాయింట్లను తెర మీదకు తీసుకురావటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. జగన్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చూస్తే పవన్ లోని పిరికి యాంగిల్ స్పష్టంగా కనిపించక మానదు.