ఆయన తాజా మాజీ మంత్రి. నిన్న మొన్నటి వరకు జగన్ కేబినెట్‌లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. యువ నాయకుడు.. ఫైర్ బ్రాండ్ కావడంతో సీఎం జగన్ ఆయనకు తొలికేబినెట్‌లో నే అవకాశం ఇచ్చారు. ఆయనే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే... బీసీ నాయుడు.. అనిల్ కుమార్ యాదవ్. అయితే.. మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో ఎక్కడా ప్రజల మద్య ఉండలేదనే వాదన ఉంది. ఎంత సేపూ అమరావతి, హైదరాబాద్ చుట్టూ తిరిగేవారని ఆయన అనుచరులే చెప్పుకొచ్చారు. ఒక సందర్భంలో ఒక సందర్భంలో ఫ్లెక్సీలు పెట్టారు. ``మా మంత్రి బిజీ.. ఆయనను కలిసేందుకు ఎవరూ రావొద్దు`` అని ఫ్లెక్సీల్లో రాశారు.
తీరా దీనిపై ఆరాతీస్తే.. ఆయననియోజకవర్గంలో పర్యటించిందే లేదని తెలిసింది. అయితే.. ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్ర అంటూ. అనిల్ తోసిపుచ్చారు. విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలపై పంచ్ డైలాగులతో ఎదురు దాడి చేశారు. ఇలా మూడేళ్లు గడిచిపోయింది. కొన్నాళ్లు కరోనా అన్నారు. మరికొన్ని వారాల పాటు.. థైరాయిడ్ సమస్యకు హైదరాబాద్‌లో ప్రజల సొమ్ముతో వైద్యం చేయించుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సరే.. ఏదేమైనా.. ఆయన మంత్రిగా ఉండగా .. మాత్రం నియోజక వర్గంలో కింది స్తాయి నేతలు ఆయనకు కనిపించలేదు. కేడర్‌ను అస్సలు పట్టించుకోలేదు.
అయితే.. ఇప్పుడు స్టోరీ రివర్స్ అయింది. జగన్ 2.0 కేబినెట్‌లో అనిల్‌ను పక్కన పెట్టారు. అంతే! రెండు రోజుల్లో.. ఆయన కు అసలు విషయం తెలిసి వచ్చింది. ఇంకేముంది.. ప్రజల్లోకి వెళ్లిపోయారు. రహదారుల సమస్యలు, స్థానిక సమస్యలు, రైతుల సమస్యలు అంటూ.. రాగాలు తీస్తున్నారు. తాజాగా నెల్లూరు నగరంలోని నవాబుపేట లో ఉన్న మార్కెట్ యార్డు స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించి, వ్యాపారస్తులకు అనువుగా షాపుల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేసి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని కూడా చె్ప్పడం గమనార్హం.
అయితే.. అధికారంలో ఉండగా.. అంటే.. మంత్రిగా చలాయించినప్పుడు మాత్రం ఆయనకు ప్రజలు కనిపించకపోవడం.. ఒక్కవైపు చూడు అన్న విధంగా వ్యవహరించడం.. ఇప్పుడు మంత్రి పదవి ఊడేసరికి సామాన్యులు హఠాత్తుగా గుర్తుకు రావడం వంటివి చర్చకు దారితీశాయి. గత ఆరు మాసాల కిందటే మంత్రుల పనితీరుపై సీఎం జగన్ సర్వేలు చేయించారని తాడేపల్లి వర్గాలు చెప్పాయి. ఈ క్రమంలో అనిల్ పనితీరు నచ్చకే ఆయనను పక్కన పెట్టారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో ఉండకపోవడం.. మంత్రులతో రగడలు.. ఎమ్మెల్యేలతో వివాదాలు వంటివి అనిల్‌ను పదవీచ్చుతిని చేయగా.. ఇప్పుడు నిజం తెలిసి వచ్చి.. జనం బాట పట్టారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.