గ్రీన్ జోన్ పేరుతో కృష్ణా జిల్లాను చంద్రబాబు నాశనం చేశారని.. ఇప్పుడు అదే చంద్రబాబు కృష్ణా జిల్లా గురించి మాట్లాడడం నవ్వు తెప్పిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణుసు పార్థసారథి అన్నారు. మొత్తం అమరావతికే పెడితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితేమిటని ఆయన ప్రశ్నించారు. అందుకే సీఎం జగన్ అన్ని ప్రాంతాలకు న్యాయం కలిగేలా వ్యవహరిస్తున్నారన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారని పార్థసారధి అన్నారు. ‘ అమ్మఒడి’తో విధ్యాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. పెనమలూరులో నిర్వహించిన ‘జగనన్న అమ్మఒడి’కార్యక్రమంలో మాట్లాడిన ఆయన విద్య లేకపోవడం వల్లే ఆర్థిక తారతమ్యాలు ఏర్పడుతున్నాయని, ‘అమ్మఒడి’తో ఈ అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
ఆంగ్ల మాధ్యమం పై టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గు చేటన్నారు. జగన్ తీసుకొస్తున్న అమ్మఒడితో ఇంగ్లీష్ మీడియంతో ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్సార్ కుటుంబం రైతు పక్షపాతి అని, ప్రతి రైతుకు సీఎం జగన్ రైతు భరోసా అందించారన్నారు.
అభివృద్ధిని వికేంద్రీకరిస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధానిపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి అందరూ అండగా నిలవాలని పార్థసారధి అన్నారు.