జగన్ పార్టీ వైకాపాకు చెందిన ఎమ్మెల్యే సునీల్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సునీల్.. బుధవారం ఇదే జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం ప్రాంతానికి తన కారులో బయల్దేరారు. వైకాపా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప.. గడపకు కార్యక్రమం కాణిపాకంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సునీల్ హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన తన నియోజకవర్గం నుంచి కాణిపాకం బయల్దేరారు.
అయితే సునీల్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన ఇన్నోవా బలంగా ఢీకొట్టింది. దీంతో సునీల్ కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఈ ప్రమాదంలో సునీల్ కు ఎలాంటి గాయాలూ కాలేదని తెలిసింది. అయితే, ఈ ఘటనలో సునీల్ కారు నుజ్జునుజ్జయింది. అయితే, తమ నేత ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో ఆయన అభిమానులు - నియోజకవర్గం ప్రజలు హ్యాపీగా ఫీలయ్యారు. ఇక, సునీల్ మరో కారులో కాణిపాకం బయలుదేరారు. ఈ ఘటనలో ఎదురుగా వచ్చిన ఇన్నోవా డ్రైవర్ దే తప్పని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్టు తెలిసింది. ఏదేమైనా సునీల్ కు పెద్ద ప్రమాదమే తప్పింది.