'వైసీపీ నేత‌ల గుస‌గుస‌.. ఎవ‌రికీ చెప్ప‌కు బ్రో!!

Update: 2022-09-17 04:03 GMT
ఇదో చిత్ర‌మైన విష‌యం. అంత‌కు మించిన విచిత్ర‌మైన సంగ‌తి కూడా! పార్టీ ఏదైనా కూడా.. అధినేత మాట‌కు విలువ ఇవ్వాల్సిందే. అధినేత మాట‌కు జై కొట్టాల్సిందే. ఇది సాధార‌ణంగా అన్ని పార్టీల్లోనూ జ‌రిగేదే. అయితే.. విష‌యం బాగుంటే.. ఇబ్బంది లేదు. కానీ, రాజ్యాంగానికి, న్యాయ సూత్రాల‌కు కూడా విరుద్ధంగా ఉన్న‌ప్పుడు.. మెజారిటీ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్న‌ప్పుడు.. మేధావులు సైతం త‌ప్పుబ‌డుతున్న ప్పుడు కూడా.. అధినేత మాట‌ను ఎలా స‌మ‌ర్ధించాలి?   ఏ చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించాలి?

ఇదీ..ఇప్పుడు వైసీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న‌చ‌ర్చ‌. ముఖ్యంగా ఎమ్మెల్యేల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో జ‌రు గుతున్న చ‌ర్చ‌. అదేంటంటే.. మూడు రాజ‌ధానుల అంశంపై.. సీఎం జ‌గ‌న్‌.. అసెంబ్లీలో చ‌ర్చ లేవ‌నెత్తారు. దీనికి సంబంధించి.. కీల‌క‌మైన ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ముఖ్యంగా సీనియ‌ర్ల‌కు అవ‌కాశం ఇస్తున్న‌ట్టు.. ముందుగానే వ‌ర్త‌మానం వెళ్లిపోయింది. ''మీరంతా ప‌క్కా స‌బ్జెక్టుతో అసెంబ్లీకి రావాల‌ని సార్ చెప్ప‌మ‌న్నారు'' అంటూ.. నాలుగు రోజుల కింద‌ట‌..  సీనియ‌ర్ల‌కు తాడేప‌ల్లి నుంచి ఫోన్లు వెళ్లాయ‌ట‌.

అంటే.. మూడు రాజ‌దానుల‌కు అనుకూలంగావాయిస్ వినిపించేందుకు.. సీఎం జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా స‌భ లో హోరెత్తించేందుకు నాయ‌కులు ప్రిపేర్ అయి రావాల‌న్న‌మాట‌. మ‌రి ఈ క్ర‌మంలో ఏదో పైపైన మాట్లాడేస్తే.. కుద‌ర‌దు.. క‌దా! ఇదే.. సీనియ‌ర్ల‌కు కూడా ఇబ్బందిగా మారింద‌ట‌. చ‌రిత్ర పాఠాలు తిర‌గేయాలి.. సీఎం జ‌గ‌న్‌కు అనుకూల‌మైన వాద‌న తెర‌మీదికి తీసుకురావాలి. కానీ, చ‌రిత్ర‌లో అలా లేదే! ఎక్క‌డైనా.. ఏ ఒప్పందంలో అయినా.. అభివృద్ధిని వికేంద్రీక‌రించాల‌నే మాటే ఉంది.

ఇది త‌ప్ప‌.. పాల‌న వికేంద్రీక‌రించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను అభివృద్ది చేయాల‌నే.. ''జ‌గ‌న్ ఫార్ములా..'' బ‌హుశ‌.. న్యాయ కోవిదులైన‌.. అల‌నాటి రాజ‌కీయ నేత‌ల‌కు కానీ.. మేధావుల‌కు కానీ.. త‌ట్టి ఉండ‌దు. అందుకే  శ్రీబాగ్ ఒడంబ‌డిక అయినా.. మ‌రొక తీర్మాన‌మైనా.. ఏది చూసినా.. ప్రాంతాలు అబివృద్ది చెందాలంటే.. అభివృద్ది వికేంద్రీక‌ర‌ణకే పెద్ద‌లు మొగ్గు చూపించారు. కానీ, ఇప్పుడు దీనిని వ‌క్రీక‌రిస్తారో.. లేక‌.. కొత్త భాష్యం చెబుతారో.. తెలియ‌దు కానీ.. జ‌గ‌న్‌కు అనుకూల‌మైన‌.. వాద‌నే వినిపించాలి.. అనేది తాడేప‌ల్లి ఆదేశం.

దీంతోవైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ట‌. కొంద‌రు.. దీనిని ఏదొ ఒక ర‌కంగా త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నాలు కూడా చేశార‌ని.. తాజా టాక్. ఇక‌, ఇదే విష‌యాన్ని అసెంబ్లీ లాబీల్లోనూ.. నేత‌లు చ‌ర్చించుకున్నారు.

''మా అధినేత ఉన్నాడే.. ఆయ‌న చెప్పిందే.. వేదం. ఆయ‌న ఏం మాట్లాడినా.. మేం మ‌ద్ద‌తివ్వాలి. అన్ని సంద‌ర్భాల్లోనూ.. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌లేం క‌దా!'' అని..  కొంద‌రు నాయ‌కులు.. గుస‌గుస‌లాడారు. ఈ క్ర‌మంలో వీటిని విన్న పాత్రికేయుల‌కు.. బ‌య‌ట‌కు చెప్పద్దు బ్రో! అంటూ.. బ‌తిమాలుకున్నార‌ట‌. !!ఇదీ.. సంగ‌తి!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News