రెండు రోజుల పాటు ఏపీ రాజధానిలో జరిగిన వైసీపీ ప్లీనరీ దెబ్బకు రాష్ర్టంలో ఎన్నికల వేడి పూర్తిస్థాయికి చేరుకుంది. అప్పుడే ఎన్నికలు వచ్చేశాయా అన్నట్లు ఉంది. ప్లీనరీ ప్రాంగణం కిక్కిరిసిపోవడమే కాకుండా కృష్ణా - గుంటూరు జిల్లాల రోడ్లు.. హైవేలు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఆ ప్రాంతమంతా ఎన్నికల వాతావరణం కనిపిస్తుండగా, మరోవైపు.. జగన్ పార్టీ ప్లీనరీ విజయవంతం కావడంతో పాలక టీడీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టి ఆ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు.
ముఖ్యంగా జగన్ తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్నది తొమ్మిది పాయింట్లలో చెప్పడం అవన్నీ ప్రజలను విశేషంగా ఆకట్టుుకోవడంతో టీడీపీలో భయం కనిపిస్తోంది. ప్రధాన నేతల నుంచి మూలనున్న నేతల వరకు అంతా బయటకొచ్చి వైసీపీపై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించారు.
అంతేకాదు... జగన్ తన పాదయాత్రను అనౌన్స్ చేయడం... అది కూడా ఆర్నెళ్ల షెడ్యూల్ కావడంతో టీడీపీలో కంగారు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీలో హుషారు - ఉర్రూతలు - ఉత్సాహం... టీడీపీలో టెన్షన్ - విసుర్లు అన్నీ కలిసి రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.
ముఖ్యంగా ఎన్నడూ లేనట్లుగా ఈ ప్లీనరీ భారీ సక్సెస్ కావడం కూడా టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 25 వేల నుంచి 30 వేల మంది ఈ ప్లీనరీకి వస్తారనుకుని ఏర్పాట్లు చేయగా ఏకంగా 75 వేలమంది వచ్చారని.. తొలుత 25 వేల మందికోసం వండిన భోజనాలు ఏమూలకూ సరిపోలేదని వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. ఈ ప్లీనరీకి వైసీపీ శ్రేణులు ఏ స్థాయిలో తరలి వచ్చాయో చెప్పడానికే ఇదే ఉదాహరణ. అంతేకాదు.. జనాలను తరలించేందుకు ఒక్క వాహనం కూడా పెట్టకుండానే 75 వేల మంది తరలివచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ ప్లీనరీ జరిగిన రెండు రోజుల్లోనే రాష్ర్టంలో రాజకీయం ఒక్కసారిగా స్పష్టతకొచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేదానికి ఈ ప్లీనరీ స్పష్టమైన ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.