ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారుపై అవినీతి ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఆయనతో పాటు.. ఆయన కుమారుడు.. ఈ మధ్యనే మంత్రిగా పదవీ బాధ్యతలుస్వీకరించిన లోకేశ్ మీద కూడా కొత్త తరహా ఆరోపణలు రావటం గమనార్హం. తాజాగా జగన్ పార్టీ నేతలు.. లోకేశ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్.. మంత్రి లోకేశ్ బాబుకు బినామీగా మారారని.. ఆయనిప్పుడు అనధికారికంగా నారా సిద్ధార్థ్ గా మారినట్లుగా ఆరోపిస్తున్నారు.
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న జిల్లా కలెక్టర్‌ను తక్షణమే.. జిల్లా నుంచి పంపించి వేయాలంటూ జగన్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు ఇద్దరు వారసులు ఉన్నారని.. వారిలో ఒకరులోకేశ్ అయితే.. రెండోవ్యక్తి కలెక్టర్ సిద్దార్థ్ జైన్ అంటూ దుయ్యబట్టారు. లోకేశకు బినామీగా వ్యవహరిస్తున్న కలెక్టర్.. చంద్రబాబు ఆస్తులకు సంరక్షకుడి పాత్రను పోషిస్తున్నట్లుగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు జగన్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డిభాస్కర్ రెడ్డి.
కలెక్టర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఇప్పటికి పలుమార్లు జిల్లా ప్రజలు.. నేతలు.. అధికారులు.. ఫిర్యాదులు చేస్తున్నా.. ఆయన్ను సీఎం వెనకేసుకొస్తున్నారన్నారు. అసెంబ్లీకి సైతం తప్పుడు నివేదికలుపంపుతున్నా.. ఆయన్ను
వెనకుసుకొస్తున్నారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన జిల్లా స్తాయి సమావేశాల్ని తొమ్మిది నెలలకు ఒకసారి కూడా నిర్వహించలేని అసమర్థతతో కలెక్టర్ ఉండటం సిగ్గుచేటుగా అభివర్ణించారు. సిద్దార్థ్ మీద అంత ప్రేమే ఉంటే.. ఎమ్మెల్సీ కోటాలో సీటు ఇచ్చి శాసన మండలికి పంపాలే కానీ.. ఇలా కలెక్టర్ గా ఉంచటం సరికాదంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీని చేస్తే.. తాను అనుకున్నట్లుగా పనులు చేసే కలెక్టర్ బాబుకు.. చినబాబుకు ఉండరు కదా? అన్న విమర్శ వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోని పక్షంలో మే నుంచి ఆందోళనలు చేపడతామని చెవిరెడ్డి తదితరులు హెచ్చరించారు.