దివ్యాంగుల ఓట్ల‌పై వైసీపీ స్టంట్‌.. ఏం చేసిందంటే!

Update: 2022-09-09 14:30 GMT
ఏదైనా.. రాజ‌కీయాల్లో ప్ర‌ణాళిక‌లు ఉండాలే కానీ.. గోరంత చేసి కొండంత ప్ర‌చారం చేసుకోవ‌చ్చు. ఇప్పు డు ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇదే ప‌నిచేస్తోందని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి ఏవ‌ర్గానికి ఏం చేశార‌ని.. వైసీపీ నాయకుల‌ను ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. మూకుమ్మ‌డిగా అందరికీ ఇచ్చేవే ఇస్తున్నాం.. క‌దా .. అనే స‌మాధాన‌మే చెబుతారు. అంతేకానీ.. గ‌తంలో ప్ర‌త్యేకంగా కొన్ని వ‌ర్గాల‌కు అమ‌లు చేసిన‌.. ప‌థ‌కాల గురించి  మాత్రం వారు ఎక్క‌డా చెప్పేలేక పోతున్నారు.

ముఖ్యంగా రాష్ట్రంలో దివ్యాంగుల విష‌యాన్ని తీసుకుంటే.. వీరికి ఉద్యోగ, విద్య‌, సంక్షేమ ప‌థ‌కాలకు సంబంధించి ప్ర‌భుత్వాలు.. అనేక చ‌ర్య‌లు తీసుకున్నాయి. వీరికి ఉద్యోగాల్లో 3 శాతం రిజ‌ర్వేష‌న్ అమ ల‌వు తోంది. దీని ప్ర‌కారం .. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే ఉద్యోగ నోటిఫికేషన్ల‌లో వారికి రిజ‌ర్వేష‌న్ వ‌ర్తిస్తుంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఈ కోటాను అమ‌లు చేశారు. దీనికితోడు.. దివ్యాంగుల‌కు మ‌రిన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా అమ‌లు చేశారు.

ప్ర‌త్యేకంగా దివ్యాంగ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి.. వారికి నిధులు కేటాయించారు. వివిధ వృత్తుల్లో వారికి శిక్ష‌ణ ఇచ్చారు. ఆర్థికంగా బ‌లోపేతం అయ్యేలా స్టార్ట‌ప్‌లు ఏర్పాటు చేసుకునేలా.. ప్రోత్స‌హించారు. రుణాలు సైతం గ‌త ప్ర‌భుత్వం బ్యాంకుల నుంచి ఇప్పించింది. ఇక‌, దివ్యాంగుల‌ను ఎవ‌రైనా.. వివాహం చేసుకుంటే.. వారికి రూ.50 వేల చొప్పున ప్రోత్సాహ‌కం కూడా గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అమ‌లు చేసింది. త‌ద్వారా.. వారిలో భ‌రోసా నింపింది.

అయితే..  ఇప్పుడు దివ్యాంగుల‌కు సంబంధించిన‌.. అన్ని ప‌థ‌కాల‌ను.. వైసీపీ ప్ర‌భుత్వం ఎత్తేసింద‌ని.. ఆ వ‌ర్గం ఆరోపిస్తోంది. దివ్యాంగుల‌ను ఎవ‌రైనా వివాహం చేసుకున్నా.. ఎలాంటి ప్రోత్సాహ‌కం లేదు. వారికి కార్పొరేష‌న్ ఉన్నా.. నిధులు లేవు. ఇక‌, గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌థ‌కాలు కూడా అమ‌లు కావ‌డం లేదు. అయితే.. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు.. దివ్యాంగుల‌కు ఉన్న రిజ‌ర్వేష‌న్‌ను 3 నుంచి 4 శాతానికి పెంచింది. అంటే.. ఒక్క‌శాతం పెంచింది. ఇది మంచిదే. కానీ.. అస‌లు ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తే క‌దా! దీనివ‌ల్ల దివ్యాంగుల‌కు మేలు జ‌రిగేది? అనే ప్ర‌శ్న ఉంది.

కానీ, ఈ ఒక్క శాతం పెంచేసిన ప్ర‌భుత్వం.. భారీ ఎత్తున ప్ర‌చారం చేసుకుంటోంది. అంతేకాదు... త్వ‌ర‌లో నే భారీ స‌భ‌ను ఏ ర్పాటు చేయించి.. సీఎం జ‌గ‌న్‌కు స‌న్మానం చేయించేలా కూడా వైసీపీ నాయ‌కులు చ‌క్రం తిప్పుతున్నారు.

వాస్త‌వానికి రాష్ట్రంలో పెంచిన రిజ‌ర్వేష‌న్ రాష్ట్ర ఉద్యోగ నియామ‌కాల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. కానీ, రాష్ట్రంలో అస‌లు ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లే లేవు. ఉన్నా.. కూడా స్వ‌ల్పంగానే ఉన్నాయి. ఇలాంటి స‌మ‌యంలో రిజ‌ర్వేష‌న్ పెంచి ప్ర‌యోజ‌నం ఏంటి? అనేది దివ్యాంగుల ప్ర‌శ్న‌. ఇదంతా కూడా ఎన్నిక‌ల స్టంటేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News